అమరావతిలో బినామీల బాగోతం పేరుతో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు చెందిన సాక్షి మీడియాలో వస్తున్న కథనాలు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. సాక్షి పత్రికలో రెండ్రోజుల పాటు కథనాలు వచ్చిన నేపథ్యంలో విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం రాత్రి విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి సాక్షిపై తీవ్రంగా మండిపడ్డారు.
ప్రపంచ దేశాలన్నీ తిరిగి నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తానొక ఇమేజ్ తీసుకువస్తే దానికి డ్యామేజీ చేసేలా ఉద్దేశపూర్వక కథనాలు రాస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాలు రాసేప్పుడు బాధ్యత ఉండాలని.... సదరు వార్తల వల్ల వ్యక్తులనే కాదు ప్రభుత్వాన్ని డ్యామేజీ చేసిన వాళ్లు అవుతారని బాబు అన్నారు. డబ్బులు పెట్టి భూములు కొంటే అభ్యంతరం మీకెందుకని బాబు అసహనం వ్యక్తం చేశారు. అమరావతి విషయంలో విమర్శలకు భయపడి వెనక్కివెళ్లేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జగన్ పై ఆయన నిప్పులు చెరిగారు. పత్రికా ఉంది కాదా అని అసత్యవార్తలు రాస్తే కేసులు నమోదు చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. రాసిన వాటిని నిరూపించాల్సిన బాధ్యత సదరు వ్యక్తులపై ఉంటుందని అన్నారు.
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి దక్కిన ప్రాధాన్యంపై బాబు మరోమారు స్పందించారు. ఈనెల 10న ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ - ఉమాభారతిలను కలవనున్నట్లు వివరించారు. పోలవరానికి రూ.1600 కోట్ల నాబార్డు నిధులు ఇస్తామని కేంద్రమంత్రి ఉమాభారతి చెప్పారని బాబు వెల్లడించారు. దీంతో పాటు రాష్ట్రానికి రావల్సిన నిధులపై చర్చిస్తానని అన్నారు. ఏపీని కరవు రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని ఇందులో భాగంగా నదుల అనుసంధానానికి ప్రాధాన్యతనిస్తున్నామని స్పష్టం చేశారు. 225 టీఎంసీల భూగర్భ జలాలను వాడుకున్నామని, 2018 నాటికి పోలవరం మొదటి దశ పనులు పూర్తి చేస్తామన్నారు. ఏడాదిలోపే పట్టిసీమ పనులు పూర్తవుతాయని వివరించారు. పుష్కర ఎత్తిపోతల ద్వారా విశాఖకు 300 క్యూసెక్కులు అందిస్తామని, వచ్చే ఏడాది జులై లోగా వెలిగొండ టన్నెల్ పనులు పూర్తి చేస్తామన్నారు.