ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కోపం వచ్చేసింది. నిత్యం తాను చాలానే చేస్తున్నట్లుగా చెప్పుకునే బాబును ఇబ్బంది పెడుతూ.. వరుస ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ముద్రగడ తీరును చంద్రబాబే స్వయంగా తప్పు పట్టటం విశేషం. తాజాగా కడపలో ప్రత్యేకంగా మీడియా భేటీ నిర్వహించిన చంద్రబు.. మద్రగడ చేపట్టిన దీక్షపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
సాధారణంగా చంద్రబాబులో ఇలాంటి కోణం చాలా తక్కువగా కనిపిస్తుందని చెప్పాలి. ఏదైనా కీలక పరిణామం జరిగినప్పుడు ఆయన ఆచితూచి మాట్లాడతారే తప్పించి.. తొందరపడి ఆగ్రహం వ్యక్తం చేసే తీరు ఉండదు. ముద్రగడ దీక్ష కారణంగా పెరుగుతున్న ఒత్తిడి ఆయన టోన్ పెరిగేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఈ సందర్భంగా కాపుల రిజర్వేషన్ల అంశంపై తానెంత చేస్తున్న విషయాన్ని ఏకరవు పెట్టే ప్రయత్నం చేశారు.
ఎన్నికల సమయంలో తానిచ్చిన హామీ మేరకు కాపులను బీసీల్లో చేర్చే కార్యక్రమాన్ని తాను మొదలు పెట్టానని.. ఇందులో భాగంగా ఇప్పటికే జస్టిస్ మంజునాధ కమిషన్ వేసి అధ్యయనం చేసినట్లుగా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రస్తావన తీసుకొచ్చిన బాబు.. కాపులకు ఏమీ చేయని వైఎస్.. కాపు నేత ముద్రగడకు దేవుడిలా కనిపిస్తున్నారని.. కాపులకు అన్ని చేస్తున్న తాను మాత్రం దుర్మార్గుడిలా కనిపిస్తున్నానా? అంటూ మండిపడ్డారు. పోలీసు వ్యవస్థపైనే తిరుగుబాటు చేస్తే.. ఎవరి ఆస్తులకు ఎవరు బాధ్యత వహిస్తారన్న ఆయన.. కాపుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ముద్రగడ వాస్తవాలు గమనించాలన్న చంద్రబాబు మాటలు ముద్రగడ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో చూడాలి.