తెలగుదేశం పార్టీ నేతల తనయుల తీరు ఆ పార్టీ రథసారథి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తీవ్ర ఇరకాటంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. కొద్దికాలం క్రితం పలువురు నేతల తనయుల తీరుతో బాబు ఇబ్బందులు పడగా...తాజాగా హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు అంబరీష్ కర్ణాటకలోని బాగేపల్లి టోల్ గేట్ సిబ్బందిపై తన అనుచరులతో కలిసి దాడి చేసి టోల్ రూమ్ అద్దాలను పగులగొట్టి, కంపూటర్లను - ఫర్నీచర్ ను ధ్వంసం చేశాడు. అంతేకాకుండా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. ఈ వార్త కలకలం సృష్టించింది.
సాక్షాత్తు అధికార పార్టీ ఎంపీ కొడుకు చేసిన రచ్చపై మీడియాలో వరుస కథనాలు వచ్చిన నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రియాక్టయ్యారు. మీడియాలో వస్తున్న కథనాలపై సీరియస్ గా స్పందించిన సీఎం చంద్రబాబు ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను సమర్పించాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఎంతటివారైనా వదిలిపెట్టేదిలేదని సీఎం స్పష్టం చేశారు.
కాగా, ఈ పరిణామంపై ఎంపీ నిమ్మల కిష్టప్ప స్పందించారు. టోల్ గేట్ వివాదం విషయం కొత్త ఏమికాదని కామెంట్ చేశారు. గతంలో పలుమార్లు తమ వాహనం అపి గొడవ చేశారని తెలిపారు. తన పిల్లలు తప్పు చేస్తే కేసులు పెట్టి చర్యలు తీసుకోమనండి అంటూ సవాల్ విసిరారు. ఎంపీ కారు అని తెలిసినప్పటికీ కారుని టోల్ గేట్ సిబ్బంది పదే పదే అపటం పరిపాటని ఎంపీ నిమ్మల కిష్టప్ప వ్యాఖ్యానించారు. ఈ తీరుపై గతంలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. తన పిల్లలు ఉన్నత చదువులు చదివారని, వారు బాధ్యతగా వ్యవహరిస్తారని నిమ్మల కిష్టప్ప వెల్లడించారు. 30 ఏళ్లు పైబడిన పిల్లలు ఏ రోజు తప్పు చేయలేదని, తప్పు చేసుంటే సవరణ చేసుకుంటని ఆయన వెల్లడించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, తెలుగుదేశం ప్రభుత్వం కాదని నిమ్మల కిష్టప్ప వ్యాఖ్యానించారు. సమగ్రంగా విచారణ చేపట్టి తమ పిల్లలు చేసింది తప్పు అని తేలితే చర్య తీసుకోండి అని నిమ్మల కిష్టప్ప స్పష్టం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/