దారుణ పరాజయం. కలలో కూడా ఊహించలేని రాజకీయ పతనం. నిరాశ.. నిస్పృహలు నిండుగా కమ్మేసిన వేళ.. తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్తబ్దుగా ఉన్న పరిస్థితి. పార్టీకి కీలకమైన నేతలు.. కార్యకర్తల పరిస్థితి మరింత దారుణంగా ఉన్న వేళలో.. టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పలువురిని అవాక్కు అయ్యేలా చేస్తోంది.
పలు సందేహాలతో కిందామీదా పడుతున్న కేడర్ కు నేనున్నా అన్న ధీమాను.. భరోసాను బాబు నుంచి ఆశిస్తున్న వేళ.. ఆయన తన కుటుంబంతో కలిసి ఫ్యామిలీ ట్రిప్ కు ప్లాన్ చేసుకున్న వైనం బయటకు వచ్చింది. భారీ పరాజయం నేపథ్యంలో ఎన్నికల్లో పార్టీ ఇంత దారుణంగా ఎందుకు వైఫల్యం చెందిందన్న అంశంపై ఒక్కో లోక్ సభ నియోజకవర్గం వారీగా సమీక్షను చేపట్టాలని డిసైడ్ చేశారు.
ఇందులో భాగంగా తొలుత విజయవాడ ఎంపీ స్థానంతో పాటు.. ఆ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిని మీటింగ్ కు పిలుస్తున్నారు. ఇందుకు జూన్ 4 ముహుర్తంగా పెట్టారు. అయితే.. ఈ సమీక్ష అనంతరం బాబు మూడు రోజుల బ్రేక్ తీసుకోనున్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిపి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. జూన్ 6 నుంచి మూడు రోజుల పాటు ఆయన ట్రిప్ లో ఉండనున్నారు.
భద్రతా కారణాల రీత్యా ఆయన ఎక్కడకు వెళుతున్న విషయాన్ని వెల్లడించలేదు. నిత్యం బిజీబిజీగా ఉండే అధినేతలు ఫ్యామిలీ ట్రిప్ కు వెళ్లటం తప్పేం కాదు కానీ.. ఇలాంటి వేళ.. ట్రిప్ పెట్టుకోవటం ఏమిటన్న మాట టీడీపీ వర్గాల్లో కొందరి నోటి నుంచి రావటం గమనార్హం.