బ్రేకింగ్: ఆంధ్రాలో అడుగు పెట్టబోతున్న రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు?

Update: 2020-05-07 09:10 GMT
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు ఎట్టకేలకు హైదరాబాద్ వీడి ఏపీకి వస్తున్నారు. ఇంతటి కరోనా టైంలో ప్రజలకు భరోసాగా ఉండాల్సిన నేత పక్కరాష్ట్రం వెళ్లి ఇన్నాళ్లు అక్కడే ఉండిపోయారు. ఎన్ని కేసులు పెరిగినా తొంగి చూడలేదు. కానీ ఎట్టకేలకు విశాఖలో గ్యాస్ లీకై పదుల సంఖ్యలో మరణాలు వందల మంది ఆస్పత్రిపాలై భయానక వాతావరణం నెలకొనడంతో అడుగు బయటపెట్టబోతున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖపట్నం బయలు దేరారు. విశాఖలో పర్యటించేందుకు కేంద్ర హోంశాఖ బాబుకు అనుమతి ఇచ్చింది. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు విశాఖ వెళ్లడానికి కేంద్రాన్ని అనుమతి కోరారు. చంద్రబాబు వినతికి కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో బాబు విశాఖకు పయనమయ్యారు.

దాదాపు నెలన్నర తర్వాత బాబు గారు ఏపీలో అడుగుపెట్టబోతుండడం విశేషంగా మారింది. మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలు దేరి విశాఖకు బాబు చేరుకుంటారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ ప్రాంతాలకు వెళ్లి బాధితులను పరామర్శిస్తారు. ఇప్పటికే అక్కడి నేతలతో ఫోన్ లో మాట్లాడారు బాబు. గ్యాస్ లీకేజీ ప్రమాదానికి సంబంధించిన పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలు ప్రజలు, బాధితులకు అండగా నిలవాలని బాబు నేతలను కోరారు. సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
Tags:    

Similar News