సమస్యలు ఎదురైనప్పుడు.. తీవ్ర ఒత్తిడిలో ఎంత సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారన్న దాని మీదనే వారి సామర్థ్యం ఎంతన్న విషయం అర్థమవుతుంటుంది. పరాజయం షాక్ లో ఉన్న చంద్రబాబు తాజాగా ఎంత అడ్డంగా బుక్ అయ్యారన్నది చూస్తే.. అంత తోపు అంటారు.. ఇంత చిన్న ఇష్యూలో భలేగా ఫిక్స్ అయ్యారే అన్న భావన కలుగక మానదు.
ఏపీ స్పీకర్ ఎంపిక అనంతరం ఆయన్ను స్పీకర్ స్థానం వద్దకు తీసుకెళ్లే విషయంలో బాబు అనుసరించిన తీరు ఆయనవైపు వెలెత్తేలా చేసింది. చేసిన తప్పునకు.. చేయని తప్పునకు తరచూ నిందలు మోసే చంద్రబాబు.. తాజా రాజకీయంలో తాను ఎంత వెనుకబడి ఉన్నానన్న విషయం అర్థమయ్యే లోపే.. జరగాల్సిన నష్టం భారీగా జరిగిపోయింది.
సభా సంప్రదాయాల్ని తుంగలోకి తొక్కి.. అడ్డదిడ్డ నిర్ణయాలతో ఐదేళ్లు.. అసెంబ్లీలో ఏ తీరులో నిర్ణయాలు తీసుకోవాలో చెప్పిన చంద్రబాబు.. ఆయనకు అర్థమయ్యే రీతిలో తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ వ్యవహరించింది. తన జోక్యం లేకుండానే ఎన్నో నిర్ణయాలు తీసుకున్న బాబుకు.. ఆయనకు గుణపాఠం నేర్పేలా వ్యవహరించింది. తనకు జరిగే నష్టం గురించి ఆలోచించే విషయంలో బాబు అంచనా తప్పటమేకాదు.. అంత పెద్ద మనిషి అయి ఉండి సంప్రదాయాలకు గండి కొడతారా? అన్న విమర్శల జడివానలో చిక్కుకునేలా చేసింది.
స్పీకర్ ఎంపిక తర్వాత స్పీకర్ స్థానం వద్దకు అధికార.. విపక్ష నేతలు ఇరువురు సభాపతికి తోడుగా రావటం సంప్రదాయం. అధికారపక్షం నుంచి తమకు ఆహ్వానం అందలేదన్నది బాబు మాట. ఒకవేళ.. వారు ఆహ్వానం ఇవ్వలేదనే అనుకుందాం.. తనకు తానుగా సంప్రదాయాన్ని పాటిస్తూ స్పీకర్ వెంట నడిస్తే చంద్రబాబు సొమ్ములేమీ పోవుగా?
అధికారపక్షం పిలవకపోయినా.. బాబు తనకు తానుగా స్పీకర్ వెంట నడిచి.. ఆ తర్వాత అదే విషయాన్ని ప్రస్తావించి ఉంటే వ్యవహారం మరోలా ఉండేది. మీరు సంప్రదాయాన్ని పాటించలేదు.. కానీ విచక్షణతో నేను పాటించానని వేలెత్తి చూపిస్తే.. అధికారపక్షం ఆత్మరక్షణలో పడేది.
ఆ అవకాశాన్ని మిస్ చేసుకొని.. సభలో ఉండి కూడా లేవని చంద్రబాబు అడ్డంగా బుక్ అయ్యారు. ఆహ్వానం అందలేదన్న చిన్న కారణం చూపించి.. సంప్రదాయానికి తూట్లు పొడుస్తారా? అన్న మాటకు బదులు ఇవ్వలేక కిందా మీదా పడుతన్నారు. ఏమైనా స్పీకర్ ఎపిసోడ్ లో చంద్రబాబుకు భారీ డ్యామేజ్ జరిగిందని చెప్పక తప్పదు.