ఎన్నికల ఫలితాలు వెల్లడి అయిన తర్వాత ఏయే కార్యక్రమాలను ఎలా నిర్వహించాలో చర్చించిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు ఎటొచ్చీ చంద్రబాబు నాయుడి తదుపరి 'ప్రమాణ స్వీకారం' అంశం గురించి ప్రస్తావించుకోక పోవడం ఆసక్తిదాయకంగా మారింది.
సచివాలయంలో మంగళవారం కేబినెట్ భేటీ అనంతరం తెలుగుదేశం ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు వివిధ అంశాల గురించి చర్చలు జరిపారట. ఆ చర్చల్లో 'మహానాడు' నిర్వహణ అంశం ప్రస్తావనకు వచ్చిందట. అలాగే ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం గురించి కూడా చర్చించారట. వీటిని ఎలా నిర్వహించాలనే అంశం గురించి ప్రస్తావించుకున్నారు.
ఆ సందర్భంగా తెలుగుదేశం నేతలు ఫలితాల అనంతరం చంద్రబాబు నాయుడు బిజీగా ఉంటారని - జాతీయ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించాల్సి ఉంది కాబట్టి.. ఆ అంశాలను దృష్టి లో పెట్టుకుని ఆ కార్యక్రమాలను షెడ్యూల్ చేయాలని అనుకున్నారట.
ఫలితాలు వెల్లడి కాగానే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా ఉంటారని - కాబట్టి ఇక్కడి పార్టీ కార్యక్రమాలకు ఆయన అందుబాటులో ఉండరు కాబట్టి.. 'మహానాడు' కార్యక్రమాన్ని రద్దు చేసేయాలని కొంతమంది అన్నారట. గతంలో కూడా కొన్ని సంవత్సరాల్లో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించలేదని - ఈ సారి కూడా ఆ కార్యక్రమం విషయంలో పట్టింపు అవసరం లేదని అనుకున్నారట.
అందుకు బదులుగా ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని వారు అనుకున్నారట. ఏ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించినా.. ఢిల్లీలో చంద్రబాబు షెడ్యూల్ కు ఆటంకం కలగకుండా చూడాలని అనుకున్నారట! ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ.. తెలుగుదేశం ముఖ్య నేతల భేటీలో చంద్రబాబు 'ప్రమాణ స్వీకారం' కార్యక్రమం గురించి మాత్రం ప్రస్తావన రాకపోవడమే అసలైన విశేషం. ఎంతసేపూ ఫలితాల తర్వాత ఢిల్లీ రాజకీయాల్లో చంద్రబాబు బిజీగా ఉంటారు.. అనే మాటే మాట్లాడటమే కానీ, ఫలితాల అనంతరం 'ప్రమాణ స్వీకారం' ఎప్పుడు పెట్టుకోవాలనే అంశం గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ల చర్చలోకే రాకపోవడం మిగతా వాళ్లకు చర్చనీయాంశంగా మారుతోంది!