ఎన్నికల్లో టీడీపీ అదినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును మించిన వారు లేరన్న వాదన నిజమేనని ఒప్పుకోవాల్సిందే. స్వయంగా చంద్రబాబే తన మంత్రాంగాన్ని బయటపెట్టుకున్న తర్వాత కూడా ఆయన మంత్రాంగంపై ఇక ఏ ఒక్కరికి కూడా అనుమానాలు ఉండకూడదనే చెప్పాలి. తన గెలుపు కోసం ఎంతమేరకైనా దిగజారతారని చంద్రబాబుపై ఆయన రాజకీయ వైరి వర్గాలు అనాదిగా చెప్పుకుంటూ వస్తున్న మాటలన్నీ నిజమేనని ఇప్పుడు స్వయంగా చంద్రబాబే ఒప్పేసుకున్నారని చెప్పక తప్పదు. నిన్న విశాఖ నగరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోక తప్పదన్న వాదన వినిపిస్తోంది.
ఎన్నికల్లో ఓట్లను కొల్లగొట్టేందుకు ధనాన్ని వినియోగించక తప్పదని - అందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను కూడా ఆశ్రయించాల్సిందేనని చెప్పుకున్న చంద్రబాబు... ఈ దఫా ఎన్నికల్లో టీడీపీకి అలా కుదరని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. ఇటీవల ఏపీలో ప్రత్యేకించి టీడీపీ నేతలపై వరుసగా జరుగుతున్న ఐటీ సోదాల్లో దాచుకున్న ధనం మొత్తం పోయిందని - అయితే ఆ డబ్బుతోనే తాను గెలుస్తానని ఆశించిన ప్రత్యర్థులు తన మనసులోని అసలు సిసలు మంత్రాంగం తెలియపోయిందని కూడా ఆయన ఎద్దేవా చేసినట్లుగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయినా ఈ సందర్భంగా చంద్రబాబు ఏమన్నారన్న విషయానికి వస్తే.. ‘మన వాళ్లు పది రూపాయలు ఖర్చు పెట్టాలనుకుంటే.. ఐటీ వాళ్లు వచ్చి ఆ పది రూపాయలను కార్యకర్తలకు ఖర్చు పెట్టనీయకుండా చూస్తున్నారు. ఏం తమ్ముళ్లూ ఎంత దుర్మార్గం ఇది. ఇది న్యాయమా? నేను ఒకటి ఆలోచించా. శుభ్రంగా నేను ఒక్క పైసా కూడా ఇవ్వను గానీ... నేను ఏమనుకున్నానంటే.. ప్రభుత్వ పరంగానే ఈ నెలలోనే పింఛన్లు రెండు వేలిచ్చా. రైతులకు అన్నదాతా సుఖీభవ కింద నాలుగు వేలిచ్చా. పసుపు కుంకుమ కింద నాలుగు వేలిచ్చా. రైతు రుణ మాఫీ కింద ఎనిమిది వేల కోట్లను ఇస్తున్నా‘ అంటూ చంద్రబాబు తనదైన శైలిలో చెప్పుకుంటూ పోయారు.
అంటే... ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు టీడీపీ తరఫున ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకుండానే.... ఓట్లను రాబట్టుకునేందుకు అంతా ప్రభుత్వ ఖజానా నుంచే ఖర్చు చేస్తున్నట్లుగా చంద్రబాబు చెప్పుకున్నారు. టీడీపీ గెలుపు కోసం సర్కారీ సొమ్మునే ఖర్చు చేస్తున్నానంటూ చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయాయి. అంటే... ప్రజల డబ్బుతోనే ప్రజల ఓట్లను కొనుగోలు చేయడమన్న మాట. ఈ తరహాలో తన కుతంత్రాన్ని తానే స్వయంగా బయటపెట్టుకున్న వైనం చూస్తుంటే... నిజంగానే ఆశ్చర్యం కలగక మానదు. మరి చంద్రబాబు స్వయంగా బయటపెట్టుకున్న ఈ కుట్రలపై వైరి వర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.