టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిజంగానే తిరోగమనంలో వెళుతున్నట్టుంది. అధిక జనాభాతో ఇప్పటికే దేశం నానా అవస్థలు పడుతోంటే... జనాభా పెరుగుదలను నియంత్రించలేక కేంద్ర ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. జనాభా నియంత్రణ కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా నిధులనూ భారీ ఎత్తున వెచ్చించింది. ఫలితాలు కాస్తంత సానుకూలంగానే వస్తున్న దాఖలా ఇప్పుడిప్పుడే కనిపిస్తుంటే... కేంద్రం కూడా కాస్తంత ఊపిరి పీల్చుకుందని చెప్పక తప్పదు. ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న మాటలు వింటే మాత్రం కేంద్రం మరోమారు ఆందోళనకు గురి కాక తప్పదేమో. ఎందుకంటే... ఓ వైపు జనాభా నియంత్రణ కోసం కేంద్రం నాన్ స్టాప్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటే.. చంద్రబాబు మాత్రం జనాభాను ఇట్టే పెంచేయండి, ఎక్కువ మంది పిల్లలను కనేయండి అంటూ పిలుపునిచ్చేస్తున్నారు.
ఒకరు ముద్దు - ఇద్దరు హద్దు అంటూ కేంద్రం చెబుతుంటే... ఇద్దరు కాదు నలుగురు అంటూ చంద్రబాబు కొత్త రాగం అందుకున్నారు. ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో నేడు డ్వాక్రా మహిళలతో భేటీ సందర్భంగా గుట్టల కొద్దీ హామీలు గుప్పించిన చంద్రబాబు.. రాష్ట్రంలో జనాభా రేటు పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాబా రేటు పడిపోకుండా చూడాలంటూ ఇకపై ప్రతి కుటంబం నలుగురు పిల్లలను కనాలని ఆయన పిలుపునిచ్చారు. పిల్లలను కనమని సెలవైతే ఇచ్చారు గానీ... మరి వారి పోషణ - విద్యాభ్యాసం - ఉద్యోగం తదితరాలను మాత్రం బాబు ప్రస్తావించలేదు. అయినా జనానికి సుద్దులు చెప్పేందుకు బానే ఉంది గానీ... మరి తన పుత్రరత్నం నారా లో్కేశ్ కు ఇదే మాట ఎందుకు చెప్పడం లేదో అర్ధం కాదు. తనకు ఏక లింగంగా లోకేశ్ ఉంటే... ఆ ఏక్ లింగానికి కూడా ఏక్ లింగమే అన్నట్లుగా చంద్రబాబు భావన ఉన్నట్లుగా కనిపిస్తోంది.
జనానికి చెప్పే మాట పుత్రరత్నం లోకేశ్ కు కూడా చెప్పి... లోకేశ్ - బ్రాహ్మణి దంపతుల ద్వారా తొలి సారి నలుగురు పిల్లలు కన్న తల్లిదండ్రులుగా వారిని జనానికి ఆదర్శంగా నిలిపితే బాగుంటుందన్న వాదన వినిపిస్తోంది. అయినా ఏ మాట చెప్పినా... జనం పాటించాలని మాత్రమే చెప్పే చంద్రబాబు... ఆ మాటను తన కుటుంబానికి ఎందుకు వర్తింపజేసుకోరో... ఏ ఒక్కరికీ అర్థం కాని సమస్యే. అయినా జనాభాను నియంత్రించకపోతే... అత్యధిక జనాభాను కలిగిన దేశమైన చ,ఐనాను మించిపోతాం.. మరిన్ని సమస్యలో చిక్కుకుంటామని అంతా ఆందోళన చెందుతుంటే... బాబేమో ఇద్దరికి నలుగురు అంటూ కొత్తగా ఈ ప్రచారం ఏమిటో అర్థం కాదు. బాబు చెబుతున్న మాట పాటిస్తే... భారత్... చైనాను అధిగమించడం చాలా సులువే. అయినా ఈ తరహా మాటల వెనుక చంద్రబాబు ప్లానేంటో అర్థం కావడం లేదు.