కృష్ణా పుష్కరాలు అనుకున్నంత సక్సెస్ ఫుల్ గా సాగుతున్నట్లుగా లేదు. ప్రభుత్వాలు లక్షల్లో లెక్కలు చెబుతున్నా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నవారు ఆ స్థాయిలో లేరని తెలుస్తోంది. గత అనుభవాల నేపథ్యంలో చాలామంది ప్రముఖులు కూడా పుష్కరాలకు దూరంగా ఉన్నారు. దీంతో పుష్కరాల హడావుడీ తగ్గింది. ఈ నేపథ్యంలో పుష్కరాలకు ఊపు పెంచేందుకో ఏమో కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ ను తీసుకొస్తున్నారు చంద్రబాబు. ఈ మేరకు ఆయన్ను ప్రభుత్వం ఆహ్వానించింది. దీంతో సూపర్ స్టార్ రజనీకాంత్ ఏపి ప్రభుత్వ అతిథిగా పుష్కరాలకు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగతంగా కూడా ఆయనతో మాట్లాడినట్లు సమాచారం.
చంద్రబాబు ఆహ్వానానికి ఓకే చెప్పిన రజనీకాంత్ తాను పుష్కరాలకు వస్తున్నట్లు సమాచారం పంపినట్లు తెలిసింది. అయితే.. ఆయన విజయవాడలోపుష్కర స్నానం చేస్తారా లేదంటే ఇంకెక్కడైనా చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్ కు విపరీతమైన క్రేజ్ ఉన్న నేపథ్యంలో ప్రత్యేక భద్రతాఏర్పాట్లు చేయాల్సిందే. లేదంటే ఆయన్ను చూడ్డానికి వచ్చే జనం పుష్కర వాహిణిలా పడతారు. దీంతో ఆయన ఎక్కడ పుష్కర స్నానం చేస్తారన్నది కీలకంగా మారంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. గుంటూరు జిల్లా చింతపల్లిలోని విష్ణు పంచాయతన దివ్య మహాక్షేత్రానికి రజనీకాంత్ హాజరయి- అక్కడ పుష్కరస్నానం చేయనున్నట్లు తెలుస్తోంది.
నిజానికి రాష్ట్రంలో ఎలాంటి భారీ కార్యక్రమం జరిగినా బాబు ప్రభుత్వం రజనీకాంత్ కు ఆహ్వానం పంపిస్తూనే ఉంది. గత గోదావరి పుష్కరాలకూ ఆహ్వానం పంపింది. ఎన్టీఆర్‌పై తిరుగుబాటు సమయంలో అసెంబ్లీ కమిటీ హాల్ లో జరిగిన ఎమ్మెల్యేల సమావేశానికి రజనీకాంత్ ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అప్పటినుంచీ రజనీకాంత్ తో బాబు సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. కాగా ఇప్పుడు మాత్రం పుష్కరాల్లో జన కళ తగ్గడంతో రజనీకాంత్ రాకతో అభిమానులు వస్తారని భావిస్తూ ఇపపటికప్పుడు పిలిచినట్లు తెలుస్తోంది. పుష్కరాల ప్రారంభానికి ముందు ఆయనకు ఆహ్వానం పంపలేదని సమాచారం.