ఏపీని నాకించేశారుగా బాబూ..వ‌చ్చే 25 ఏళ్ల వ‌ర‌కు తిప్ప‌లే..!

Update: 2019-10-21 04:32 GMT
అనుభ‌వం ఉన్న నాయ‌కుడు క‌దాని అధికారం అప్ప‌గిస్తే.. అంతా నాకించేశార‌ని అంటున్నారు ఆర్థిక నిపు ణులు. ప్ర‌స్తుతం రాష్ట్ర ఖ‌జానా పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. అంతేకాదు, గ‌డిచిన ఐదేళ్ల‌లో చేసిన అప్పుల‌ను బేరీజువేసుకుని తిరిగి చెల్లింపులు ప్రారంబిస్తే.. వ‌చ్చే 25 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఏపీ ప్ర‌భుత్వం వీటిని క‌ట్టాల్సి ఉంటుంద‌ని ఆర్థిక వేత్త‌లు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం కూడా అస‌లు అప్పులు ఎన్ని ఉన్నాయి?  గ‌డిచిన ఐదేళ్ల‌లే ఏయే అవ‌స‌రాల‌కు అప్పులు చేయాల్సి వ‌చ్చింది?  వీటిని తీర్చ‌డం ప్రారంభిస్తే.. ఎన్నాళ్లు ప‌డుతుంది? అనే కీలక విష‌యాల‌పై నివేదిక రూపొందించింది.

గ‌డిచిన ఐదేళ్ల కాలంలో అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెడుతుంద‌ని ప్ర‌జ‌లు భావిం చారు. అయితే, ఆయ‌న కాలంలో చేసిన దుబారా వ్య‌యం.. త‌మ్ముళ్ల‌కు చేసిన పంప‌కాలు.. విచ్చ‌ల‌విడి విదేశీ ప్ర‌యాణాలు వంటివి రాష్ట్రాన్ని ఆర్థికంగా కుంగ‌దీశాయి. రాష్ట్రానికి ఉన్న రుణ ప‌రిమితిని పూర్తిగా వాడేసుకుని - ఎదురు ప్రైవేటు అప్పులు కూడా చేయ‌డం గ‌మ‌నార్హం. దీంతో రాష్ట్రంపై అప్పుల భారం త‌డిసి మోపెడ‌వుతుంది. ప్ర‌స్తుతం ఆర్థిక శాఖ వ‌ర్గాలు వేసిన అంచ‌నాలు - లెక్క‌ల ప్ర‌కారం.. మొత్తం అప్పు.. రాష్ట్రంపై 244941 కోట్లు ఉంది.

దీనిలో బ‌హిరంగ మార్కెట్ రుణాలు - విదేశీ రుణాలు - నాబార్డు - ఉద‌య్ - విద్యుత్ సంస్థ‌ల రుణాలు పేరుకు పోయాయి. ఈ మొత్తం అస‌లు కావ‌డంతో వీటికి వ‌డ్డీలు జ‌త‌క‌ల‌వ‌నున్నాయి. ఈ మొత్తాన్ని తీర్చుకునేందుకు క‌నీసం 20 నుంచి 25 సంవ‌త్సాలు ప‌డుతుంద‌ని ఆర్థిక వ‌ర్గాలు అంటున్నాయి. ఈ అప్పు మొత్తంగా చంద్ర‌బాబు హ‌యాంలో జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇంత‌గా అప్పులు చేసిన ఆయ‌న రాష్ట్రంలో ఓ ల‌క్ష‌ మందికైనా ఉద్యోగాలు ఇచ్చారా ?  ఇళ్లు క‌ట్టించారా ? అభివృద్ధి చేశారా ? అంటే .. అన్నిప్ర‌శ్న‌లుగా నే మారుతున్నాయి.

ఇక‌, అప్పుల కుప్ప ఇలా ఉంది..

బ‌హిరంగ మార్కెట్ : 155376 కోట్లు
కేంద్రం నుంచి తీసుకున్న రుణాలు : 10229 కోట్లు
చిన్న‌మొత్తాల పొదుపు : 12504 కోట్లు
ప్రావిడెంట్ ఫండ్ : 14767
డిపాజిట్లు రిజ‌ర్వ్ నిధులు : 52064 కోట్లు



Tags:    

Similar News