చీరాల అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినప్పుడు టీడీపీ నేతలు తొడలు కొట్టారు. ఆమంచి పార్టీని వీడటం తమకు హ్యాపీ అని చెప్పుకొచ్చారు. కొందరు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.
అప్పుడైతే అలా హడావుడి చేశారు కానీ.. ఆమంచి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? అనే అంశం గురించి ఇప్పుడు టీడీపీలో తర్జనభర్జనలు సాగుతూ ఉన్నాయని సమాచారం. మొదట్లోనే చీరాల నుంచి ఆమంచి స్థానంలో కరణం బలరాం కు టికెట్ ఖరారు చేసినట్టుగా తెలుగుదేశం వర్గాలు ప్రకటించుకున్నాయి. టీడీపీ అనుకూల మీడియా ఆ మేరకు హడావుడి చేసింది.
కట్ చేస్తే.. ఇప్పుడు కరణం అభ్యర్థిత్వం విషయంలో చంద్రబాబు నాయుడు ఆలోచనలో పడిపోయారట. ఈ విషయంలో బాబు కసరత్తు మళ్లీ మొదటకు వచ్చిందని సమాచారం. దానికి పలు కారణాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఆమంచి గత ఎన్నికల్లో సొంతంగా విజయం సాధించారు. సొంత పార్టీ తరఫున గెలిచారు. అలా నియోజకవర్గంపై తనకున్న పట్టేమిటో నిరూపించుకున్నారు. టీడీపీ - వైసీపీలు పోటీ పడినా ఆమంచి సత్తా చూపించారు. అలా నియోజకవర్గంపై గ్రిప్ కలిగిన ఆమంచి.. ఆర్థికంగా కూడా బలంగా కనిపిస్తూ ఉన్నారు.
ఈ సారి కూడా ఆర్థికంగా భారీగా ఖర్చు పెట్టడానికి ఆమంచి వెనుకాడటం లేదని చంద్రబాబుకు అర్థమైందట. క్షేత్ర స్థాయిలో ఆమంచి ఆర్థిక వ్యవహారం చాలా ప్లాన్డ్ గా ఉన్నారట. ఇలాంటి నేపథ్యంలో ఆయనతో ఢీ కొట్టడానికి కరణం బలరాం చేత అవుతుందా? అనేది బాబులో గుబులు రేపుతోందట. ఆమంచి ఆర్థిక శక్తి గురించి ఆఫ్ ద రికార్డ్ గా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ముప్పై కోట్లు ఖర్చు పెట్టగల సమర్థుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారట!
ఈ పరిణామాల నేపథ్యంలో కరణాన్ని మళ్లీ బాబు పిలిపించుకున్నారట. ఈ రోజు సాయంత్రం ఐదు గంటకు మళ్లీ సమావేశం కాబోతున్నారని సమాచారం. ఈ మేరకు అపాయింట్ మెంట్ ఇచ్చారట. ఈ వ్యవహారంపై ఈ రోజు బాబు తేల్చేసే అవకాశం ఉందని సమాచారం.