నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం అంటూ పదే పదే చెప్పుకునే చంద్రబాబుకు తెలిసిన విధంగా మీడియా మేనేజ్ మెంట్ చేయడం రాష్ట్రంలో ఏ నేతకు పెద్దగా తెలియదనే చెప్పాలి. అధికారంలో ఉన్నా - ప్రతిపక్షంలో ఉన్నా ఆయన చెప్పు చేతల్లోని చాలా తెలుగు మీడియా సంస్థలు నడుస్తాయనేది బహిరంగ రహస్యమే. అయితే అదే మీడియా అడ్డం పెట్టుకుని చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పై విష ప్రచారం చేయిస్తున్నారని వైసీపీ నేతలతో పాటు చాలా మంది సందేహిస్తున్నారు.
ఎందుకంటే తొలిసారి అధికారంలోకి వచ్చిన జగన్....ఎప్పుడు లేని విధంగా ఐదు నెలల పాలన కాలంలోనే అదిరిపోయే నిర్ణయాలు - అద్భుతమైన పథకాలు అమలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టారు. లక్షల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు. అయితే జగన్ ఇంత చేసిన ప్రజల్లో వ్యతిరేకిత ఉందనే భావన కొన్ని మీడియా సంస్థలు కల్పిస్తున్నాయి. అలా ఉన్నది లేనట్టుగా - లేనిది ఉన్నట్టుగా చూపించే మీడియా యెల్లో మీడియానే అని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఈ క్రమంలోనే బాబు కొన్ని జాతీయ మీడియా సంస్థలతో కూడా రహస్యంగా భేటీ అయ్యి - వారి చేత కూడా వైసీపీకి నెగిటివ్ గా ప్రచారం చేయిస్తున్నారని తెలిసింది. ప్రతి శుక్రవారం రాత్రి హైదరాబాద్ కు వెళుతున్న బాబు...కొన్ని జాతీయ మీడియా సంస్థల అధినేతలతో - ఎడిటర్లతో రహస్య చర్చలు చేస్తున్నట్లు తెలిసింది. తాజాగా కూడా దీపావళి ముందు బాబు హైదరాబాద్ లోని తన నివాసంలో జాతీయ మీడియా ప్రతినిధులతో రహస్య సమావేశం అయినట్లు సమాచారం.
ఇందులో వైసీపీకి వ్యతిరేకంగా - టీడీపీకి అనుకూలంగా ప్రసారాలు చేయాలని చెప్పినట్లు తెలిసింది. అలాగే నవంబర్ 3న జనసేన ఆధ్వర్యంలో జరిగే లాంగ్ మార్చ్ కూడా భారీ ఎత్తున కవర్ చేయాలని సూచించినట్లు సమాచారం. దీంతో పాటు వైసీపీకి వ్యతిరేకంగా ఏవైతే కథనాలు ప్రసారం చేస్తారో అవి వెంటనే టీడీపీ సోషల్ మీడియా విభగానికి పంపాలని కోరినట్లు తెలిసింది.
ఇటీవల ఇసుక - అమరావతి - పరిశ్రమల్లో 75 శాతం రిజర్వేషన్లు...తాజాగా వైసీపీ రంగులు వేయడం లాంటి వాటిపై జాతీయ మీడియా వైసీపీకి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేసింది కూడా. ఇక ఇలా చేసినందుకు బాబు పార్టీ తరుపున గట్టిగానే నిధులు కేటాయిస్తున్నారని - జాతీయ మీడియాతో పాటు లోకల్ మీడియాకు కూడా బాబు నిధులు ఇస్తున్నట్లు సమాచారం. మొత్తానికి బాబు మీడియాతో వైసీపీ ప్రభుత్వం మీద పెద్ద కుట్రే చేస్తున్నట్లు ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.