రాహుల్ తో చంద్రబాబు సమావేశం..ఏ మాట్లాడారో!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ తో ఏకాంత చర్చలు జరిపారట. రాహుల్, చంద్రబాబుల సమావేశం పదిహేను నిమిషాల పాటు సాగిందని ఇంగ్లిష్ మీడియా వర్గాలు చెబుతుంటే.. తెలుగుదేశం అనుకూల మీడియా వర్గాలు మాత్రం రాహుల్ - చంద్రబాబులు అరగంట పాటు సమావేశం అయ్యారని కథనాలు ఇస్తున్నాయి.
చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ను పనిగా పెట్టుకుంటాయి కొన్ని మీడియా వర్గాలు. సో అవి రాహుల్ తో చంద్రబాబు నాయుడి మీటింగ్ సమయాన్ని కూడా పెంచి ఉండవచ్చు. వీళ్లు సమావేశం అయ్యారు సరే.. ఇంతకీ వీళ్లు దేని గురించి చర్చించారు.. అనే అంశం గురించి మాత్రం స్పష్టత లేదు.
ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు చెప్పలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పడం లేదు. ఇప్పుడు ప్రీ పోల్ కూటమి గురించి చర్చించేది ఏమీ లేదు.సీట్ల ఒప్పందం చర్చలు లేవు. ఇలాంటి నేపథ్యంలో వీళ్లు పీఎం క్యాండిడేట్ గురించి చర్చించినట్టుగా ఒక ప్రచారం జరుగుతూ ఉంది.
బీజేపీ వ్యతిరేక పక్షాల తరఫున ప్రధానమంత్రి అభ్యర్తి ఎవరనే అంశం గురించి మే ఇరవై ఒకటిన జరగబోయే మీటింగులో తాము తేలుస్తామంటూ చంద్రబాబు నాయుడు ఆ మధ్య ఒక ప్రకటన చేశారు. బహుశా ఆ అంశం గురించినే బాబు మాట్లాడి ఉంటారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయినా రాహుల్ తో ఆ టాపిక్ లో చర్చ ఏముంది.. తనే ప్రధానమంత్రి అభ్యర్థి అని రాహుల్ ఇప్పటికే తేల్చేశారు. కాబట్టి.. రాహుల్ దగ్గర ఆ విషయంలో మరో పాయింట్ పై చర్చ ఉండకపోవచ్చు!