తిరుపతిలో మూడురోజుల పాటు మచ్చటగా జరిగిన మహానాడు ముగిసింది.మహానాడు జరిగిన మూడు రోజులు పసుసు చొక్కాలతో మెరిసిపోయిన తెలుగు తమ్ముళ్లు.. మహానాడు ముగిసిందో లేదో డ్రెస్సింగ్ స్టైల్ మార్చేయటం విశేషం. మహానాడు జరిగిన రోజులన్నీ పసుపు చొక్కాలు వేసుకొని.. తిరుపతి వేదిక వద్ద దర్శనమిచ్చారు. ఇక..పార్టీ అధినేత చంద్రబాబు సైతం పసుపు చొక్కాలోనే దర్శనమిచ్చారు. చాలా కొద్ది మంది మాత్రమే మహానాడుకు కూడా తెల్ల చొక్కాల్లో వచ్చినోళ్లు ఉన్నారు. ఏమైనా మహానాడు సందర్భంగా పసుపు రంగు చొక్కాల్లో తమ్ముళ్లు మెరిసిపోయారనే చెప్పాలి. అలాంటి వారి చొక్కాలన్నీ రోజు గడిచేసరికి ‘రంగు’ మారిపోటం గమనార్హం.
రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు.. నాలుగు స్థానాల్లో పోటీ చేయాలా? మూడు స్థానాలకు పోటీ చేయాలన్న అంశంపై పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు బెజవాడలో సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి కొందరు ముఖ్యనేతల్ని చంద్రబాబు ఆహ్వానించారు.
నిన్నటి వరకూ పసుపు చొక్కాల్లో మెరిసిపోయిన నేతలంతా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీకి మాత్రం తెల్ల చొక్కాల్లో వచ్చారు. తమ్ముళ్లతో పాటు.. వారందరికి బాస్ అయిన చంద్రబాబు సైతం తన మార్క్ ముదురు గోధుమ రంగు చొక్కాతో సమావేశానికి హాజరయ్యారు. యధా రాజా.. తథా ప్రజ అన్నట్లుగా.. అధినేత బాటలోనే తమ్ముళ్లు సైతం నడుస్తారు కదా?