అమెరికాలో పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాజాగా చేదు అనుభవం ఎదురైందని చెబుతున్నారు. తన టూర్లో భాగంగా ప్రవాస తెలుగువారు నిర్వహించిన కార్యక్రమంలో బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్న వేళ.. ఊహించని రీతిలో సభికుల నుంచి నిరసన వ్యక్తమైంది.
కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొన్నట్లుగా చెబుతున్నారు. ఇంతకీ ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైందంటే.. చినబాబుకు అత్యంత సన్నిహితుడు.. సినీ తారల సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఆరోపణల్ని ఎదుర్కొంటున్న నిందితుల్ని పక్కన పెట్టుకొని కూర్చోవటం.. ప్రసంగించటం ఏమిటంటూ నిలదీశారు.
చంద్రబాబు తన ప్రసంగాన్ని స్టార్ట్ చేసిన వేళ.. ఉన్నట్లుండి సభలో పెద్ద కలకలం. నేరారోపణలు ఉన్న వారు.. దర్యాప్తును ఎదుర్కొంటున్న వారి పక్కన కూర్చోబెట్టుకొని బాబు ఎలా ప్రసంగాలు చేస్తారని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నించారు.
బాబుకు.. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి తీరును తప్పు పడుతూ పెద్ద ఎత్తున స్లోగన్స్ ను ఇవ్వటంతో బాబు సభలో గందరగోళం చోటు చేసుకుంది. వేదిక మీద ఉన్న వివాదాస్పద వ్యక్తిని వేదిక కిందకు పంపాలన్న డిమాండ్ చేశారు. అసలేం జరుగుతుందో అర్థం కాని వేళ.. రంగంలోకి దిగిన కార్యక్రమ నిర్వాహఖులు సభికుల్ని శాంతించే ప్రయత్నం చేశారు.
ఈ నెల 22న బాబు అమెరికా పర్యటనకు వెళ్లటం.. అదే రోజు శ్రీకాకుళం అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే (వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి వలస వచ్చారు) ను నక్సల్స్ కాల్చి చంపిన వైనాన్ని సభలో బాబు ప్రస్తావించారు. న్యూజెర్సీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సినీ తారల సెక్స్ రాకెట్ కేసులో విచారణ ఎదుర్కొన్న వారిని బాబు తన పక్కన ఎలా కూర్చోబెట్టుకుంటారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.