ఇదిగిదిగో.. ఆసుప‌త్రిలో దాస‌రి

Update: 2017-02-03 16:53 GMT
సికింద్రాబాద్‌ లోని కిమ్స్‌ లో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ డైరెక్టర్‌ దాసరి నారాయణరావుకు పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు.  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు - మెగాస్టార్ చిరంజీవి - అల్లు అరవింద్‌ - వీవీ వినాయక్‌ - మోహన్‌ బాబు దంపతులు - జయప్రద త‌దిత‌రులు దాస‌రి యోగ క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాసరి నారాయణరావును పరామర్శించిన అనంత‌రం  దాసరి ఆరోగ్యంపై చంద్రబాబు కిమ్స్‌ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దాసరిని పరామర్శించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ...దాసరి నారాయణరావు త్వరగా కోలుకున్నందుకు చాలా సంతోషమని అన్నారు. వెంటిలేటర్‌ పై ఉన్నారని పుకార్లు వచ్చాయని అయితే అవ‌న్నీ అవాస్త‌వాల‌ని చంద్ర‌బాబు నాయుడు పేర్కొన్నారు. దాసరి క్రమంలో కోలుకుంటున్నారని, దాసరి ఇంకా పూర్తిగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు. దాస‌రి నారాయణరావుతో కుటుంబసభ్యుడిలా కలిసి ఉన్నామని సీఎం చంద్రబాబునాయుడు ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఆస్పత్రిలో దాసరిని పరామర్శించిన అనంతరం మెగాస్టార్‌ చిరంజీవి మీడియాతో మాట్లాడారు. రెండుమూడు రోజులుగా ఆందోళన చెందామని, ఆయన్ను చూశాక ధైర్యం వచ్చిందని తెలిపారు. దాసరి నారాయణరావు ఆరోగ్యంగా, హుషారుగా ఉన్నారని చిరంజీవి అన్నారు. దాసరి ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని, ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఈ సమయంలో కూడా దాసరి ఖైదీ నంబర్ 150 కలెక్షన్ల గురించి అడిగారు. సినిమా కలెక్షన్లు - స్కోరు ఎంత అని దాసరి ఆరా తీశారన్నారు. 'సినిమా కలెక్షన్లు రూ.150కోట్లు దాటిందని చెప్పగా, రూ.250కోట్లు దాటాలని పేపర్‌పై రాసి చూపించారు. దాసరి ఎంత హుషారుగా ఉన్నారో ఈ మాటలను బట్టే అర్థమవుతుంది. ఖైదీ నంబర్ 150 విజయోత్పవ సభకు మీరే ముఖ్య అతిథిగా రావాలని దాసరికి విజ్ఞప్తి చేశా. మీరు వచ్చే వరకు విజయోత్సవ సభను వాయిదా వేస్తానని దాసరికి చెప్పినట్లు" చిరంజీవి వెల్లడించారు. నాలుగు రోజుల్లోనే దాసరి ఇంటికి తిరిగి వెళ్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. మ‌రోవైపు దాసరి నారాయణరావు ఆరోగ్యంపై కిమ్స్ వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. డయాబెటిస్‌ ను కంట్రోల్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, దాసరికి ఫ్లూయిడ్స్‌ అందిస్తున్నామని కిమ్స్‌ వైద్యులు వెల్లడించారు.దాసరి నారాయణరావు ఆరోగ్యం మెరుగుపడిందని కిమ్స్ వైద్యులు తెలిపారు. కిమ్స్ వైద్యులు ఆయనకు వెంటిలేటర్ సహాయంతో శస్త్ర చికిత్స చేశారు. ఊపిరితిత్తులు నిలకడగానే పని చేస్తున్నాయని పేర్కొన్నారు. దాసరి గొంతుకు ప్రెకాస్టమీ ఆపరేషన్ చేయడం వల్ల మాట్లాడలేకపోతున్నారని చెప్పారు. నాలుగు రోజుల తర్వాత ఐసీయూ నుంచి ప్రత్యేక వార్డుకు తరలిస్తామని తెలిపారు. మూత్రపిండాలు - ఊపిరితిత్తుల ఇన్‌ ఫెక్షన్‌ తో రెండు రోజుల క్రితం దాసరి సికింద్రాబాద్ కిమ్స్‌లో చేరిన విషయం విదితమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News