ఓపక్క తెలంగాణ రాష్ట్రం సంబురాలతో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల్లో మునిగి తేలుతుంటే.. మరోవైపు విభజన జరిగిన తీరు మీద సీమాంధ్రలో ప్రజలు గంభీరంగా ఉండే పరిస్థితి. విభజన కారణంగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో.. విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన వారి మనోభావాల తగ్గట్లుగా నవ నిర్మాణ దీక్ష పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక కార్యక్రమాన్ని చేపట్టటం తెలిసిందే.
ఓపక్క ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతుంటే.. మరోవైపు నవ నిర్మాణ దీక్ష పేరుతో భారీగా కార్యక్రమాన్ని నిర్వహించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందులో భాగంగా బెజవాడలోని కీలకమైన బెంజ్ సర్కిల్ ను వేదికగా ఎంపిక చేసుకోవటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నిత్యం జనసమ్మర్థంగా ఉండే కూడలిలో ఇలాంటి భారీకార్యక్రమాలు నిర్వహించటం అంటే.. ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేయటమేనన్న విమర్శ ఉంది.
ఇలాంటి కార్యక్రమాల్ని పరేడ్ గ్రౌండ్స్ లాంటి ఖాళీ స్థలాల్లో కానీ.. స్టేడియంలలో కానీ నిర్వహించాలి. అంతే తప్ప నడిరోడ్డు మీద ఇలాంటి భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావటం ఖాయం. బాబు చేపట్టిన నవ నిర్మాణదీక్షకు 30 వేలకు పైచిలుకు హాజరవుతారని చెబుతున్నారు. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలాది మంది ఒక చోటకు చేరటం లాంటి వల్ల ట్రాఫిక్ కష్టాలతో పాటు.. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. అదే.. స్టేడియం లాంటి చోట్ల అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లకు వీలు ఉంటుంది. మరి.. ఇలాంటి విషయాల్ని చంద్రబాబు ఎందుకు మర్చిపోతున్నారు..?