దేశంలో సీనియర్ రాజకీయవేత్తను అని ప్రకటించుకునే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలు వేరు, రాజ్యాంగబద్దమైన వ్యవస్థలు వేరనే విషయం గమనించాల్సిన బాబు...ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు. 71 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్ ఎట్ హోమ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు దీనికి డుమ్మా కొట్టారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని ప్రతి ఏడాది రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయిగా వస్తోంది. ఈ సంప్రదాయం ప్రకారం - ఏపీ గవర్నర్ గవర్నర్ బిశ్వభూషణ్ రాజ్ భవన్ లో ఇచ్చిన విందుకు ముఖ్యమంత్రి జగన్ - మంత్రులు బుగ్గన - బొత్స - స్పీకర్ తమ్మినేని - మండలి చైర్మన్ షరీఫ్ తదితరులు హాజరయ్యారు. బీజేపీ నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం దూరంగా ఉన్నారు. సీనియర్ నేత అని చెప్పుకొనే చంద్రబాబు ఈ రకంగా సంప్రదాయలను కూడా లైట్ తీసుకోవడం ఏంటనే చర్చ జరుగుతోంది.