ఏపీ సీఎం చంద్రబాబుకు తన మంత్రివర్గం లోని అందరినీ ఒకేలా చూడరని చెబుతుంటారు. కొందరు ఏమీ చేయకుండా హడావుడి చేస్తే వారికి శహబాస్ అంటూ భుజం తడుతుంటారని.. గొడ్డులా కష్టపడే మంత్రులను కూడా కనీసం పలకరించకుండా వెళ్లిపోతుంటారని చెబుతుంటారు. అంతేకాదు.. పార్టీకి సంబంధించిన విషయాల్లో కొందరు మాట్టాడితే దాన్ని ఇష్యూ చేసి మందలిండచం .. మరికొందరి విషయంలో ఏమీ తెలియనట్లు ఉండడం చంద్రబాబుకే చెల్లిందని టీడీపీ నేతలు అంటున్నారు. అందుకు తాజా ఉదాహరణ చెబుతున్నారు.
కాంగ్రెస్- టీడీపీ మధ్య పొత్తు కుదురుతుందని అంతా అనుకుంటున్న వేళ - పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న వేళ దానిపై కొద్దిరోజుల కిందట డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి - మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడారు. కాంగ్రెస్ తో పొత్తు ఉండదని చెబుతూ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో చంద్రబాబు వారిపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఇలాంటి విషయాలపై తాను తప్ప ఎవరూ మాట్లాడొద్దంటూ మండిపడ్డారు.
కానీ, తాజాగా మరో డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప కూడా అదే వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ విషయం చంద్రబాబు నిర్ణయిస్తారని చెప్పారు. అంతేకాకుండా సొంత పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పైనా ఆయన విమర్శలు చేశారు. దివాకర్ రెడ్డికి ఇంకా కాంగ్రెస్ పార్టీ వాసన పోలేదని - అధికార పార్టీలో ఉన్నా పోలీస్ వ్యవస్థపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దీనిపై చంద్రబాబు ఏమీ స్పందించకపోవడంతో... గతంలో చంద్రబాబుతో చీవాట్లు తిన్న అయ్యన్న - కేఈలు మండిపడుతున్నట్లు సమాచారం.