మాట జారితే వెనక్కి తీసుకోవటం ఎంత కష్టమో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిసి వస్తోంది. ఆవేశంతోనో.. ఆగ్రహంతోనో తాను నోరు జారిన మాట చూపించే ప్రభావం గురించిన ఆలోచనల్లో ఉన్నారో.. ఏమో కానీ.. తానీ రోజు రాజకీయాల గురించి మాట్లాడనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భూ దురాక్రమణ అంటూ ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఏపీ అధికారపక్షానికి చెందిన నేతలు బినామీల పేరిట భారీగా భూముల్ని కొనుగోలు చేశారంటూ జగన్ పత్రిక మూడు రోజులుగా భారీ కథనాన్ని ఇవ్వటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా.. ఎవరి డబ్బులతో వారు భూములు కొనటం కూడా తప్పా? అంటూ వేసిన ప్రశ్న పలువురిని విస్మయానికి గురి చేసింది. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నోటి వెంట అలాంటి మాటేమిటని షాక్ తిన్నోళ్లు ఉన్నారు. ఇక.. బాబు నోటి నుంచి ఇలాంటి మాట కోసమే ఎదురుచూస్తున్న జగన్ బ్యాచ్ అయితే.. భారీగా ఈ మాటను పెద్ద పెద్ద అక్షరాలు అచ్చేసి.. బాబును ఎంత బద్నాం చేయాలో అంతా చేసేశారు.
ఈ ఎఫెక్ట్ బాబు మీద పడినట్లుంది. శుక్రవారం ఆయన.. గుంటూరు జిల్లా కోటప్పకొండకు వెళ్లిన ఆయన్ను.. జగన్ బ్యాచ్ చేస్తున్న ఆరోపణలపై స్పందించాలని కోరినప్పుడు చంద్రబాబు కాస్తంత భిన్నంగా స్పందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చేస్తున్న తుచ్చమైన రాజకీయాల గురించి తాను మాట్లాడాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. తానీ రోజు రాజకీయాల గురించి మాట్లాడనని.. ఒక పవిత్ర కార్యక్రమం కోసం తాను వచ్చానని.. రాజకీయాల గురించి రేపు మాట్లాడుకుందామని వ్యాఖ్యానించటం గమనార్హం.
పుణ్యక్షేత్రాల దగ్గర రాజకీయాలు మాట్లాడటం సరికాదన్న ఉద్దేశంతో బాబు రియాక్ట్ కాలేదని తమ్ముళ్లు కవర్ చేస్తుంటే.. బాబు ఆత్మరక్షణలో పడిపోయారని.. అందుకే ఆయన నోటి వెంట ఇలాంటి మాటలు వస్తున్నాయని జగన్ బ్యాచ్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా రాజకీయాలే శ్వాసగా ఫీలయ్యే చంద్రబాబు లాంటి నేతలు.. రాజకీయాల గురించి మాట్లాడనని అనటం ఏమిటి..?