చంద్రబాబు అంటే నాయకత్వానికి మారుపేరుగా చెబుతారు. కాన్ఫిడెన్సు - టీంపై విశ్వాసం - టీంను ప్రోత్సహించడం వంటివన్నీ కీలకమే. కానీ, చంద్రబాబు మాత్రం తాను తప్ప తన టీంలోని మిగతావారంతా పనికిరానివారేనంటూ వారిని మరింత నిరుత్సాహపరుస్తున్నారు. ఎవరిపనితీరూ బాగులేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు తొమ్మిదేళ్లు తాను సీఎంగా ఉన్నప్పటి టీం బాగుండేదని.. ఇప్పుడున్న టీం ఎందుకూ పనికిరావడం లేదంటూ నీరుగారుస్తున్నారు. దీంతో చంద్రబాబు మంత్రులు - పార్టీ నేతలు కూడా చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారట. తమలో ఏవైనా లోపాలుంటే నాయకుడిగా బాబు తమకు మార్గదర్శనం చేయాలే కానీ ఇలా పనికిరానివారంటూ ముద్ర వేయడం ఎంతవరకు సమంజసమంటున్నారు.
పార్టీ సమావేశాలు - ప్రభుత్వ సమావేశాల్లో చంద్రబాబు నుంచి ఎవరో ఒకరికి ఎప్పుడో ఒకసారి అక్షింతలు పడుతూనే ఉంటాయి. కానీ, మంగళవారం జరిగిన టీడీపీ - ఏపీ కేబినెట్ సమన్వయ కమిటీ సమావేశంలో మాత్రం చంద్రబాబు పూర్తిగా అందరినీ పనికిరానివారిగా లెక్కగట్టేయడంతో అందరూ గుర్రుగా ఉన్నారు. మంత్రుల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను కూడా నిరుత్సాహం ఆవరిస్తోందని చెప్పారు. గతంలో తనకు మంచి టీం ఉండేదని ఏదైనా చెబితే వెంటనే చొచ్చుకుపోయి పనిచేసేవారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడు మాత్రం ఎవరికి వారే తమకెందుకులే అన్న భావనతో పనిచేస్తున్నారని అన్నారు. 1999లో తన కేబినెట్ చాలా ఉత్సాహంగా పనిచేసేందన్నారు. కానీ ఇప్పటి టీం చాలా నిరుత్సాహంగా పనిచేస్తోందని… మంత్రుల పనితీరు చూస్తుంటే తననూ నిరుత్సాహం ఆవరిస్తోందని చెప్పారు.
అయితే చంద్రబాబు ఇలా తన మంత్రులపై అపనమ్మకం వ్యక్తం చేయడంపై పార్టీ వర్గాల్లో విమర్శలు వస్తున్నాయి. మొన్నటికిమొన్న శిక్షణ కార్యక్రమాల్లో అందరినీ చూసి ముచ్చటపడిన చంద్రబాబు ఇంతలోనే అంత మాట ఎలా అంటారని అంటున్నారు. ఏం చేయాలో సూచనలు చేయాలి కానీ ఏకంగా ఇలా గాలి తీసేస్తే తమ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/