గ్రేటర్ లో పవన్ ను చంద్రబాబు వాడుకోరట

Update: 2016-01-06 07:05 GMT
2015 ఎన్నికల నాటి సీను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.. ఏపీలో టీడీపీ - వైసీపీ మధ్య పోరు తీవ్రంగా ఉంది. గెలుస్తామని టీడీపీ నమ్మకంగానే ఉన్నా ఎక్కడో ఏదో మూల చిన్నపాటి భయం. అంతలో బీజేపీ వైపు నుంచి ఎంట్రీ ఇచ్చి ఆ పార్టీ మిత్రపక్షం టీడీపీ తరఫునా ప్రచారం చేసి 3 శాతం ఓట్లను మల్లించి టీడీపీ విజయాన్ని ఖాయం చేసేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు అంత సీను లేకపోయినా తెలంగాణలో టీడీపీకి కీలకమైన గ్రేటర్ హైదరబాద్ లోనూ పవన్ ఎంతో కొంత ప్రభావం చూపించే అవశాకం ఉంది. ఆ సంగతి గుర్తించే టీటీడీపీ నేతలు బీజేపీ-టీడీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం కోసం జనసేన నేతను తీసుకురావాలని ప్రయత్నించారట. అయితే. ఆయన నుంచి పెద్దగా  రెస్పాన్సు రాకపోవడంతో తమ అధినేత చంద్రబాబు చెబితే వినే అవకాశముందని భావించి చంద్రబాబును గోకారు. పాపం... అక్కడా వారికి నిరాశే ఎదురైందట. పవన్ ను నేనైతే పిలవను.. ప్రతిసారీ ఎన్నికల కోసం ఆయన్ను వాడుకున్నట్లుగా ఉంటుంది.. అదేమీ బాగుండదు అని ఆయన టీటీడీపీ నేతలతో అన్నట్లు సమాచారం.

అసలు చంద్రబాబు గ్రేటర్ ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని ఎవరికైనా అర్థమవుతోంది. ఆయన అసలు దానిపై దృష్టే పెట్టలేదు. టీటీడీపీ నేతల ఒత్తిడి భరించలేక లోకేశ్ కొంతవరకు చూసుకోమని పురమాయించారు.  వస్తేగిస్తే ఆయన చివర్లో మొక్కుబడిగా ప్రచారానికి వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితి అర్థం చేసకున్న టీటీడీపీ నేతలు కనీసం పవన్ వచ్చినా కొంత నయమని ఆశపడుతున్నారు. కానీ, అందుకూ చంద్రబాబు ఓకే చెప్పలేదు.  మీరు పిలిస్తే వస్తే నాకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ నేను మాత్రం ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేయనని చెప్పారట. ఎన్నికల కోసమే నేను పవన్ ను వాడుకుంటున్నాననే అపవాదొస్తుంది. పైగా మనం గ్రేటర్ లో వచ్చే సీట్లతో చేసేది ఏమీ ఉండదు. ఆయనతో అవసరం ఏపీలో చాలా ఉంది...  కాబట్టి ఇప్పుడు ఆయన జోలికి పోలేను అని తెగేసి చెప్పేశారట. దీన్నిబట్టి కాపులపై అన్ని పార్టీలూ కన్నేసిన నేపథ్యంలో పవన్ ను తురుపు ముక్కగా వాడుకునేందుకు చంద్రబాబు ఏదో పెద్ద అస్త్రమే రెడీ చేస్తున్నట్లుగా అర్థమవుతోంది. మరోవైపు పూర్తిగా ఏపీకే పరిమితం అయిన చంద్రబాబు ఇప్పుడు పవన్ ను కూడా ఏపీకే పరిమితం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
Tags:    

Similar News