మైకు ముందు మాట్లాడే అవకాశం వస్తే చాలు.. ఏ వేదిక మీద ఉన్నాం.. ఏ మాట్లాడాలన్న విషయాన్ని పట్టించుకోకుండా తన గురించి తాను.. తన గొప్పల గురించి అదే పనిగా చెప్పుకోవటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటు. తాజాగా అలాంటి పనే మరోసారి చేశారు. అందరిని కలుపుకొని ఏపీకి ప్రత్యేక హోదా సాధన ఎలా అన్న విషయం మీద కంటే కూడా తన రెండు రోజుల ఢిల్లీ పర్యటన ఎలా సాగిందన్న విషయంతో పాటు.. తానెంతగా కష్టపడుతున్న విషయాన్ని.. మోడీతో తాను కోట్లాట పెట్టుకోవటం ఎంత పెద్ద విషయమో తెలుసా? అంటూ స్వమర్దనం చేసుకున్న వైనం చూస్తే.. బాబుకు నాయకత్వ లక్షణాలు ఇంత తక్కువా? అన్న డౌట్ రాక మానదు.
ఏదైనా విషయం మీద అఖిలపక్షం అన్నది ఎందుకు ఏర్పాటు చేస్తారు? ప్రభుత్వం ఒక్కరే కాకుండా అందరిని కలుపుకోవటంతో పాటు.. చేయాలనుకున్న పనిని అందరూ కలిసి కట్టుగా చేయటం కోసం అఖిలపక్షం ఏర్పాటు అవుతుంది. అయితే.. అఖిలపక్షానికి ముఖ్యమైన వారు హాజరయ్యేందుకు వీల్లేకుండా చేసిన చంద్రబాబు.. తనకు వంతపాడే బ్యాచ్ తో నిర్వహించిన సమావేశంలో తన గొప్పలకే సమయాన్ని కేటాయించటం కనిపించింది.
మోడీలాంటి డిక్టేటర్ తో పెట్టుకోవటం అంటే మాటలు కాదని.. తాను కాబట్టి తట్టుకుంటున్నానని.. మరొకరికి సాధ్యం కాదని చెప్పుకోవటం చూస్తేనే బాబు వైఖరి ఎలా ఉందన్నది అర్థమవుతుంది.
తన గొప్పల గురించి చెప్పిన బాబు.. రానున్న రోజుల్లో ఏపీని మోడీ సర్కారు టార్గెట్ చేస్తుందన్నట్లుగా మాట్లాడారు. నాలుగేళ్ల తన పాలనలోచోటు చేసుకున్న అవినీతిపై మోడీ సర్కారు దృష్టి పెడుతుందన్న ప్రచారం నేపథ్యంలో.. ముందస్తు జాగ్రత్తగా మోడీపై వ్యతిరేకతను రాజేస్తూ.. అందులో తన తప్పుల్ని కవర్ చేసుకునేందుకు బాబు అఖిలపక్షం వేదికను వాడుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సందర్భంగా మోడీ మంత్రివర్గంలోని వారు తనతో చెప్పారంటూ చెప్పిన మాటల్ని చెప్పిన బాబు.. మోడీ ఇగోను శాటిస్ ఫై చేసేందుకు తానెంతగా శ్రమపడిన విషయాన్ని చెప్పుకొచ్చారు. నిజంగానే మోడీతో ఇబ్బందిగా ఉంటే బయటకు రావాల్సి ఉంది. దేశంలో మోడీతో అందరూ దోస్తానా చేస్తున్నారా ఏంది? అయనతో సున్నం పెట్టుకొని పోరాడుతున్న రాష్ట్రాలు లేకపోలేదు కానీ.. అవేమీ లేవన్నట్లు.. తాను మాత్రమే మోడీతో ఫైట్ చేస్తున్నట్లుగా ఇచ్చిన కలర్ చూస్తే.. తన తప్పుల్ని పక్కకు వెళ్లేలా.. మోడీ మీద రాష్ట్ర ప్రజలంతా మరింత ఫోకస్ చేసేలా బాబు మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు. పేరుకు అఖిలపక్షమే కానీ.. తన గొప్పల్ని చెప్పుకోవటానికే ఆ వేదికను బాబు వాడుకున్నారనే చెప్పాలి.