పేరుకు అమరావతి..అక్కడున్నదంతా భ్రమరావతి..!

Update: 2019-12-05 08:56 GMT
అమరావతి ..నూతన ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా గొప్పగా ప్రారంభించారు. అమరావతిని సింగపూర్ చేస్తానంటూ ..3D ప్రింట్లు - సూపర్ డిజైన్స్ తో అందరిని ఆకట్టుకొని ..వేల ఎకరాల సాగు భూమిని రైతుల నుండి లాగేసుకున్నారు. ఆ తరువాత వచ్చిన ఎన్నికలలో రాజధాని రైతులు - రాష్ట్ర ప్రజలు టీడీపీ కి తగిన బుద్ధి చెప్పారు. అయినప్పటికీ ..తాజాగా అమరావతి పర్యటన అంటు మరో సరికొత్త నాటకానికి తెరతీశారు. ప్రపంచస్థాయి రాజధాని కడతానన్న చంద్రబాబు .. అమరావతిని పేక మేడలకు  పరిమితం చేసింది కాక పర్యటనకి వచ్చారు.

అసలు ఎప్పుడూ అమరావతిలో ఉండే చంద్రబాబు ప్రత్యేకంగా పర్యటించాల్సిన అవసరం ఏమిటో... రాజధానిని స్మశానంతో పోల్చారని బొత్సా గారిపై గింజుకుంటున్న చంద్రబాబు గారు అక్కడ ఏముందో చూపించమంటే మాత్రం ఎందుకు గుటకలు మింగుతున్నాడు?  ఎందుకంటే అక్కడ గ్రాఫిక్స్ తప్ప ఏమి లేదు కాబట్టి... ఉంటే టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని చౌదరి అమరావతి లో గేదెలు ఎందుకు మేపాడో చెప్పు బాబూ... ఎంతో గొప్పగా చూసుకోవాల్సిన రాజధానిలో బీర్ బాటిళ్లు కుప్పలుగా పోసే నిర్లక్ష్యానికి ఎందుకు దిగజారిందో చెప్పు బాబు.

ప్రపంచ భ్రమరావతి కి ఐదేళ్లలో ఖర్చు చేసిన 5 వేల కోట్లలో 2 .40 లక్షల కోట్ల అప్పులు చేసి కూడా రాజధాని కి లక్ష 9 వేల కోట్లతో ప్రణాళికలు వేసి 5ఏళ్లలో దాదాపు 5 వేల కోట్లు(4900 ) కోట్లు మాత్రమే ఎందుకు ఖర్చు చేశావు బాబు. నువ్వు అమరావతి నిర్మాణానికి పెట్టిన  2 .40  లక్షల కోట్లలో కేంద్రం ఇచ్చిన 2500 కోట్లు తీసేస్తే నువ్వు ఖర్చు పెట్టింది ఎంత చంద్రబాబూ... ఒక్క శాతం . అంత మొత్తం ఖర్చు చేసి కూడా  నువ్వు కట్టింది చిన్న వర్షానికే నీరు కారే రెండు తాత్కాలిక అసెంబ్లీ సెక్రటేరియట్ భవనాలు. అంత మాత్రానికే  నువ్వేదో ఇంధ్రభవనం కట్టానని బడాయికి పోతే ఎలా చంద్రబాబు.
Tags:    

Similar News