తమ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వాపోతూ ఉన్నారు.గత కొన్నాళ్లుగా చంద్రబాబు నాయుడు ఇదే అంశం మీద స్పందిస్తున్నారు. తాజాగా అందుకు సంబంధించి మరోసారి చంద్రబాబు గణాంకాలను ఏకరువు పెట్టారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చాకా ఇప్పటి వరకూ రెండు వందల ఎనభైకి పైగా దాడులు జరిగాయని అన్నారు. ఆ దాడులు అన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు తమ పార్టీ వాళ్ల మీద చేసిన దాడులే అని చంద్రబాబు అన్నారు. ఈ దాడుల్లో అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలు గాయపడగా - ఏడుగురు మరణించారని చంద్రబాబు నాయుడు చెప్పారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్రతీకార దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చేస్తున్నారన్నట్టుగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి పేర్ని నానిని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారు. పేర్ని నాని వేధింపులతో ఒక మహిళ ఆత్మహత్య చేసుకుని మరణించింది.. అలాంటి మంత్రుల తీరు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అర్థం కాదా? అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం కార్యకర్తలు - నేతల్లో ఎవరికి ఏమైనా దానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాలని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం విశేషం.