ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం అనేది ప్రధాన ఎజెండా అని ప్రకటించినప్పుడే చంద్రబాబునాయుడు ప్రభుత్వం పిలుపు ఇచ్చిన అఖిలపక్ష భేటీకి ప్రధాన పార్టీలు హాజరుకాలేదు. అలాంటి నేపథ్యంలో తాను రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించి ఏం సాధించానో సొంత డబ్బా కొట్టుకోవడమే ప్రధాన అజెండాగా... చంద్రబాబు నాయుడు మళ్ళీ రెండోసారి అఖిలపక్ష సమావేశానికి పిలుపు ఇస్తే ఎవరు మాత్రం పట్టించుకోం టారు? అందుకే చంద్రబాబు అఖిలపక్ష సమావేశం ప్రయోజనం బెడిసికొడుతోంది. శనివారం జరగవలసిన అఖిలపక్ష భేటీ ఇదివరకటికంటే దారుణంగా విఫలం కాబోతుంది.
చంద్రబాబు నాయుడు తొలిసారి అఖిలపక్ష సమావేశం నిర్వహిం చినప్పుడు , ప్రత్యేక హోదా కల్పించడం కోసం ఉమ్మడి పోరాటమే ఆవిరికి అజెండా అని ప్రకటించారు. ఇప్పటికీ అర్ధరాత్రి ఆహ్వానించి ఉదయాన్నే సమావేశానికి రమ్మంటే ఎలా అంటూ జనసేన పార్టీ - తెలుగుదేశం దురాలోచనను సహకరించం అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ దూరంగా ఉండి పోయాయి. హాజరైన వామపక్షాలు కూడా చంద్రబాబు తీర్మానాలు రుచించక ఛీకొట్టి వెళ్లిపోయాయి.
అఖిల పక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని తొలుత భావించిన చంద్రబాబు ఆ అభంగపాటును భరించలేక తానొక్కడే ఢిల్లీ వెళ్లి ఒక ప్రెస్ మీట్ నిర్వహించి తిరిగొచ్చారు.
తాను ఢిల్లీలో ఎంత అద్భుతంగా రాష్ట్రం కోసం పని చేశానో చెబుతాను రమ్మంటూ ఆయన ఈ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందుకే ఈసారి కనీసం వామపక్షాలు కూడా బయటికి వెళ్లడం లేదు. కాంగ్రెస్ కూడా దూరంగా ఉండదలుచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. చూడబోతే గతంలో కంటే దారుణంగా చంద్రబాబు అఖిలపక్ష ప్రయత్నం ఈసారి కూడా విఫలం అవుతున్నట్లు కనిపిస్తోంది.