తాజా ఎన్నికల్లో టీడీపీ అంచనాలు తలకిందులయ్యాయి. గెలుపుపై భారీ దీమాతోనే కనిపించిన టీడీపీ... చివరకు ఫలితాలు వెలువడ్డాక కనీసం నోరు కూడా పెగల్చలేని పరిస్థితి. అయితే రాజకీయాలన్నాక గెలుపు, ఓటములు సహజమే కదా. ప్రజలు తమను ఎందుకు తిరస్కరించారన్న విషయాన్ని ఓడిన పార్టీ సమీక్షించుకోవాలి. ఓటమికి గల కారణాలను బేరీజు వేసుకోవాలి. అసలు తమను ఓటర్లు తిరస్కరించడానికి అసలు సిసలు కారణాలను వెతికి మరీ పట్టుకోవాలి. అప్పుడు కనీసం భవిష్యత్తులో అయినా ఓడిన పార్టీలకు గెలిచే అవకాశాలు ఉంటాయి.
సరే... ఇప్పుడు ఓటమిపాలైన, అది కూడా ఘోర ఓటమిని చవిచూసిన టీడీపీ ఆ దిశగా సాగుతున్నట్లుగా లేదు. ఇప్పటికీ ఎన్నికల్లో తమ ఓటమికి గల కారణాలను బేరీజు వేసుకునేందుకు ఆ పార్టీ ఎంతమాత్రం సిద్ధంగా లేదన్న భావనే వ్యక్తమవుతోంది. సరే.. ఇక అసలు విషయంలోకి వెళితే... ఓటమి భారంతో గడప దాటి బయటకు వచ్చేందుకే ఇష్టపడని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనను కలిసేందుకు వస్తున్న వారితో తన ఇంటిలోనే కలుస్తున్నారు. బాబు వద్దకు వస్తున్న వారంతా ఆయనను ఓదార్చేందుకేనన్న విషయం కూడా రహస్యమేమీ కాదు.
ఎక్కడెక్కడి నుంచో బాబు వద్దకు వస్తున్న టీడీపీ సానుభూతిపరులు... ఇలా జరిగేంటీ బాబూ అంటూ ఆయనను ఓదారుస్తున్నారు. టీడీపీ అనుకూల మీడియా ఈ వార్తలను ఫొటోలతో సహా వాడేస్తోన్న విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు సోమవారం పార్టీలోని పలువురు సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకే ఈ భేటీని నిర్వహించిన చంద్రబాబు... భేటీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీపైనా, తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపైనా ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదని ఆయన సంచలన వ్యాఖ్య చేశారు.
గతంలో పోల్చితే.. ఇప్పుడు టీడీపీపై పెద్దగా వ్యతిరేకత ఏమీ కనిపించడం లేదని చంద్రబాబు అన్నారట. అంటే వ్యతిరేకత లేకుంటేనే... తమ బలం 23కు పడిపోతే... బాబు అనుకుంటున్నట్లుగా ప్రజల్లో వ్యతిరేకత ఉండి ఉంటే టీడీపీ తుడిచిపెట్టుకుపోయేదేనన్న మాట. అసలు ఓటమికి గల కారణాలు ఏమిటో విశ్లేషించుకోవాల్సింది పోయి... ఇలా ఇంకా తమకు తామే స్వయంగా జాకీలు వేసుకుని బొక్కబోర్లా పడేందుకే ఆయన ఎందుకు ఉబలాటపడుతున్నారో నిజంగానే అర్థం కాని పరిస్థితే.