ఏపీలో పండుగ వాతావరణం వచ్చేసింది. ఈసారి దసరా కంటే కూడా ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవం సరికొత్త ఉత్సాహభరిత వాతావరణాన్ని తీసుకొచ్చేసింది. చరిత్రలో చాలా అరుదుగా జరిగే ఇలాంటి కార్యక్రమాలకు ఇప్పటి ప్రజలు సాక్ష్యంగా ఉండటం ఒక గొప్ప విషయంగా చెప్పుకోవాలి.
వందల ఏళ్ల పాటు సాగే చరిత్రలో ఇప్పటి రోజులు అలా నిలిచిపోతాయి. ఎందుకంటే.. ఏపీ రాజధాని అమరావతి ఉన్నంత కాలం.. ధాని నిర్మాణం ఎలా జరిగింది? ఆ సమయంలో ఎవరేం చేశారు? ఎలా వ్యవహరించారు? శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి అంశాలు ఎంతోకొంత చరిత్రలో ఆక్రమిస్తాయి. ఈ నేపథ్యంలో.. హుందాగా ఉండే రాజకీయాల్ని భవిష్యత్తు తరాలకు అందాల్సిన అవసరం ఉంది.
కానీ.. సమకాలీన రాజకీయాల్ని చూస్తే అలాంటి పరిస్థితేమీ కనిపించటం లేదు. చౌకబారు రాజకీయాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగిలిన సమయాల్లో ఎలా వ్యవహరించినా ఫర్లేదు కానీ.. కొన్ని కీలకమైన సమయాల్లో తీసుకునే నిర్ణయాలు చరిత్రలో అలా ఉండిపోతాయి. ఏపీ విభజన కారణంగా.. దారుణమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో రాజధాని నిర్మాణం సాగుతోంది.
నిజానికి రాష్ట్రాన్ని ముక్కలు చేసిన వాళ్లు.. రాజధాని గురించి కానీ..రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఏ విషయాల్ని కనీసం ప్రస్తావన కూడా తీసుకురాకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేసేశారు. ఇలాంటి సమయంలో అందరూ ఆమోదించే రీతిలో రాజధాని నిర్మాణం జరగటం సాధ్యం కాకపోవచ్చు. కానీ.. వీలైనంతవరకూ అలాంటి పరిస్థితిని తీసుకరావాల్సిన అవసరం ఉంది.
సీమాంధ్ర ప్రజల దురదృష్టం ఏమిటంటే.. అటు అధికార పక్షం కానీ.. ఇటు ప్రతిపక్షం కానీ తమ రాజకీయ చట్రం నుంచి బయటకు వచ్చి నిర్ణయాలు తీసుకునేలా చొరవ తీసుకోవటం లేదు. చరిత్రలో మొండితనం.. మూర్ఖత్వం.. పొగరుబోతుతనం.. అధికారమదం లాంటి మాటలకు అవకాశం ఇచ్చేలా పరిణామాలుచోటు చేసుకుంటున్నాయి. విషయాల్ని సాపేక్షంగా చూసినప్పుడు.. ఏపీ రాజకీయ పార్టీల దివాళకోరుతనం స్పష్టంగా కనిపిస్తుంది.
మొదట అధికారపక్షమైన తెలుగుదేశం విషయాన్నే తీసుకుంటే.. మిగిలిన విషయాల్ని పక్కన పెడితే.. రాజధాని నిర్మాణానికి సంబంధించిన స్థల నిర్ణయ అంశం కానీ.. పేరు విషయంలో కానీ.. నిర్మాణానికి సంబంధించిన అంశాల విషయంలో అధికారపార్టీ ఎక్కడా విపక్షాలకు అవకాశం ఇవ్వలేదు. రాజధాని అన్నది సీమాంధ్ర ప్రజలది. ఏఒక్క పార్టీ గుత్త సొత్తు కాదన్న విషయం మర్చిపోకూడదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే.. రేపొద్దున వైఎస్సార్ కాంగ్రెస్ ఉండొచ్చు.. లేదంటే మరో కొత్త రాజకీయ శక్తి అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు. అంటే.. అధికారం ఎవరికి శాశ్వితం కాదు.
కానీ.. రాజధాని మాత్రం శాశ్వితం. పాలకులు మారతారు కానీ.. పాలించే ప్రదేశం ఎప్పటికప్పుడు మారిపోవటం కుదరదు. అందుకే.. ప్రజల్ని ప్రభావితం చేసే రాజకీయ పక్షాలు హుందాగా వ్యవహరించి ఉండాల్సింది. విభజన విషయంలో సీమాంధ్ర పార్టీ నేతల మధ్య లోపించిన ఐకమత్యం.. ముందుచూపు కారణంగానే విభజనలో భారీగా నష్టం జరిగింది. ఎవరు అవునన్నా.. కాదన్నా.. భవిష్యత్తు తరాలు భారీగా నష్టపోయే అవకాశానికి కారణమైంది.
ఇలాంటివి చూసిన తర్వాత అయినా రాజకీయ పార్టీలు గుణపాఠాలు నేర్పలేదు. రాజధాని నిర్మాణానికి సంబంధించి అన్నీ పనులు చంద్రబాబు తాను ఒక్కడినై చేస్తున్నారు. నిజమే.. రాజధాని నిర్మాణం చేసిన వ్యక్తిగా చరిత్రలో బాబు తన పేరు ఉండాలని తపించటం తప్పేం కాదు. కానీ.. అన్ని రాజకీయ పార్టీల్ని ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి.. కొన్ని కీలకమైన అంశాలతో అఖిలపక్ష నిర్ణయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే ఎంతో ఉన్నతంగా ఉండటమే కాదు.. అమరావతి రాజధాని నిర్మాణం ఒక చారిత్రక సన్నివేశంగా ఉండేది. అన్ని విషయాల్లో కాకున్నా.. కొన్ని విషయాల్లో అయినా ఏపీ రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో ఉమ్మడి నిర్ణయాలు తీసుకొని ఉంటే బాగుండేది.
కొంతలో కొంత నయం ఏమిటంటే.. రాజధానికి సంబంధించి ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం వ్యక్తం కాకున్నా.. ‘‘అమరావతి’’ అన్న పేరు విషయంలో మాత్రం విమర్శలు పెద్దగా వినిపించలేదు. పేరు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో.. మిగిలిన విషయాల్లోనూ ఏపీ అధికారపక్షం హుందాగా వ్యవహరించి ఉంటే బాగుండేది.