ఏపీలో తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా మరో విభాగం ఏర్పాటు కానుంది. ప్రస్తుతం టీడీపీకి అనుబంధంగా యువత - విద్యార్థి - బీసీ - ఎస్సీ - ఎస్టీ - మహిళా - కార్మిక - ఉపాధ్యయ విభాగాలు పనిచేస్తున్నాయి. కొత్తగా ఇప్పుడు టీడీపీ అనుబంధ అంగన్ వాడీ సంఘాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తెలుగునాడు అంగన్ వాడీ ట్రేడ్ యూనియన్ పేరుతో ఈ సంఘాన్ని వచ్చే సోమవారం రిజిస్టరు చేస్తారని తెలుస్తోంది.
ఇటీవల అంగన్ వాడీ సిబ్బంది వేతనాల కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం.... విజయవాడలో ధర్నా ఉద్రిక్త రూపం దాల్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇలాంటి సంఘాలన్నీ వామపక్షాలకు అనుబంధంగా ఉంటూ పోరాటాలు చేస్తున్నాయి. ఇకపై టీడీపీకి అనుబంధంగా సంఘం ఉంటే చెప్పినట్లు వింటారని... యూనియన్ల మధ్య విభజన ఏర్పడి అంతా ఒకే సారి ధర్నా చేసే పరిస్థితి కూడా ఉండదని భావిస్తున్నారు.
దీన్ని ఒక్క అంగన్ వాడీతో ఆపేయకుండా నిత్యం ధర్నాలు చేసే వర్గాలన్నిటిలోనూ తెలుగుదేశం అనుబంధ సంఘాలను చొప్పించే ప్రయత్నం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.