తెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీలో రచ్చకు తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టారు. విశాఖలో భూ దందా - విశాఖ తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భూ దందాలు, పార్టీ క్రమశిక్షణను నేతలు ఉల్లంఘించడంపై చర్చించారు. ఈ సమయంలోనే పార్టీ నేతల వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖాముఖీ మాట్లాడుకుని విభేదాలు పరిష్కరించుకోవాలని మంత్రులు అయ్యన్న పాత్రుడు - గంటా శ్రీనివాసరావులను ఆయన ఆదేశించారని తెలుస్తోంది.
మంత్రి అయ్యన్నపాత్రుడు తీరుపై గంటా శ్రీనివాసరావు బహిరంగ లేఖ రాయడం, విశాఖలోని టీడీపీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయిన నేపథ్యంలో సమన్వయ కమిటీ సమావేశం హాట్ హాట్ గా సాగింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విశాఖలో పార్టీలో విభేదాలపై ప్రధానంగా చర్చ జరిగింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఇకపై చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. మంత్రుల మధ్య విభేదాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. విభేదాలతో పార్టీ పరువు బజారున పడేయద్దని హెచ్చరించారని పార్టీ వర్గాల సమాచారం. ఈ సమయంలో మాట్లాడుకుని విభేదాలు పరిష్కరించుకోవాలని మంత్రులు ఇద్దరినీ ఆయన ఆదేశించారని తెలుస్తోంది.
అయితే సుదీర్ఘకాలంగా గంటా శ్రీనివాసరావు - చింతకాయల అయ్యన్న పాత్రుడుల మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో కేవలం చర్చల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని చంద్రబాబు భావించినట్లుగా చెప్తున్నారు. అందుకే పార్టీ పరంగా త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అత్యంత ఆసక్తికరంగా ఈ నిర్ణయానికి ముందు చర్చ జరుగుతున్న సమయంలో మంత్రులు గంటా - అయ్యన్న పాత్రుడులను సమావేశం నుంచి బయటకు పంపారు. మరోవైపు హైదరాబాద్ భూముల కుంభకోణంలో అరెస్టయిన పార్టీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని సస్పెండ్ చేయాలని సమన్వయ కమిటీ భేటీ నిర్ణయించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/