ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు పొసగడం లేదా? అసెంబ్లీ సమావేశాలు తెరమీదకు వచ్చిన ప్రతిసారి వారిద్దరి మధ్య ఉన్న అప్రకటిత దూరం తేటతెల్లం అవుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ఖరారు తీరే ఇందుకు నిదర్శనమని తెలుస్తోంది.
స్వరాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు పట్టుదలతో ఉన్నారు. ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముందూ ఈ ప్రస్తావన రాగా ఆ సమయంలో నాగార్జున విశ్వవిద్యాలయంలో సమావేశాలు ఏర్పాటు చేయాలని స్పీకర్ అనుకున్నారు. స్వయంగా ఆ ప్రాంగణాన్ని సందర్శించి సదుపాయాలను పరిశీలించారు. ఇక్కడే నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే సీఎం చంద్రబాబు సుముఖత తెలపలేదు. వర్షాకాల సమావేశాల విషయంలోనూ ఇదే తరహా డైలమా కొనసాగింది. ఇలా అసెంబ్లీ సమావేశాల ప్రస్తావన వచ్చినప్పుడల్లా గుంటూరు జిల్లాలోనే ఏర్పాటు చేయాలనే ఆకాంక్ష వ్యక్తమవుతుండటం... స్పీకర్ కోడెల ప్రతిపాదించడం...ఆనక వాయిదా పడటం జరిగిపోతోంది.
అయితే బడ్జెట్ సమావేశాలను స్వరాష్ట్రంలోనే జరిపేందుకు స్పీకర్ చేసిన ప్రతిపాదనను సీఎం చంద్రబాబు అంగీకరించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ క్రమలో ఓ ప్రైవేటు యూనివర్సిటీ ప్రాంగణాన్ని స్పీకర్ కోడెలతో పాటు అసెంబ్లీ కార్యదర్శి, చీఫ్ మార్షల్స్ తో కూడిన బృందం సందర్శించింది. ఇక్కడే సమావేశాలు ఉంటాయని ప్రకటించింది. అయితే తాజాగా చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయానికి చెక్ పెట్టారు. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా హైదరాబాద్ లోనే నిర్వహిస్తున్నట్లు మంత్రివర్గ సహచరులకు తేల్చిచెప్పారు.
మొత్తంగా అసెంబ్లీ నిర్వహణపై కోడెల సమావేశాలకు ముందే వేగంగా కసరత్తు చేయడం....ఇక్కడే జరుపుతామని ప్రకటించడం...ఆనక దాన్ని సీఎం చంద్రబాబు మార్చివేయడం వళ్ల స్పీకర్ కు-సీఎంకు పడట్లేదనే అభిప్రాయాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళుతున్నట్లయిందని పొలిటికల్ సర్కిల్ లో జోరుగా టాక్ నడుస్తోంది.