తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ప్రెస్ మీట్ ను అర్ధంతరంగా ముగించారు. ముద్రగడ దీక్ష నేపథ్యంలో కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్న సమాచారాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్న ఆయన కడపలో నిర్వహిస్తున్న ప్రెస్ మీట్ ను ఆపేసి అధికారులతో సమావేశమయ్యారు. అంతకుముందు ఆయన ప్రెస్ మీట్లోనూ కాపుల విషయమై మాట్లాడారు. కాపుల సమస్యల పట్ల, వాటి పరిష్కారం పట్ల ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. కాపుల డిమాండ్లను ఒక్కటొక్కటిగా పరిష్కరిస్తూనే ఉన్నామని చెప్పారు. అయితే.. అదే సమయంలో కిర్లంపూడిలోని తన ఇంట్లో దీక్షకు దిగిన ముద్రగడ పద్మనాభం పురుగు మందు డబ్బా పట్టుకుని హల్ చల్ చేయడంతో పరిస్థితులు అక్కడ ఉద్రిక్తమయ్యాయి. ఆ విషయం తెలుసుకున్న చంద్రబాబు కొంత టెన్షన్ పడ్డారని తెలుస్తోంది. పరిస్థితిని సమీక్షించి... ఏం చేయాలో నిర్ణయించేందుకు ప్రెస్ మీట్ ను సగంలోనే ఆపేసినట్లుగా చెబుతున్నారు. చంద్రబాబు ఇలా తన ప్రెస్ మీట్ ను సగంలో ముగించిన సందర్భాలు చాలా అరుదు. దీంతో చంద్రబాబు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారని... ఏం చేయాలో నిర్ణయం తీసుకునేందుకు అధికారులు, ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారని తెలుస్తోంది.
ముద్రగడ దీక్షకు సంబంధించిన సమాచారాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా అవసరమని క్లియర్ కట్ గా చెప్పారు. ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షకు దిగడం మంచిది కాదని అన్నారు. మరోవైపు ముద్రగడను అరెస్టు చేసేందుకు.. దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు అప్పుడే ప్రయత్నాలు తీవ్రం చేశారు. అమలాపురం ధర్నా కేసులో ఆయన్ను అరెస్టు చేసేందుకు వెళ్లారు. ముద్రగడ నుంచి ప్రతిఘటన వచ్చినా కూడా అరెస్టు చేసి తీరాలని పోలీసులు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
కిర్లంపూడిలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ముద్రగడ దీక్షకు అన్ని ఏర్పాట్లు జరుగతున్నట్లుగానే కనిపిస్తోంది. ఢీఐజీ కిర్లంపూడి చేరుకున్నారు. ముద్రగడ ఇంటి వద్ద ఉన్న మీడియా ప్రతినిధులను పోలీసులు బయటకు పంపేస్తున్నారు. ముద్రగడ అనుచరులను కూడా ఆయన ఇంటికి దూరంగా వెళ్లేలా పోలీసులు వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఈ రోజు మధ్యాహ్నానికే ముద్రగడ దీక్షను భగ్నం చేస్తారన్న వాదన వినిపిస్తోంది.