గొప్ప నాయకులుగా గుర్తింపు పొందినవారు కూడా తప్పటడుగులు వేస్తుంటారు. అయితే... సకాలంలో తప్పును తెలుసుకుని సరిదిద్దుకునేవాడే సరైన నేత. గొప్ప నేతల కంటే సరైన నేతలే ప్రస్తుత రాజకీయాల్లో రాణిస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అనుభవజ్ఞులను ఎవరినైనా కదిపి చంద్రబాబు - కేసీఆర్ లలో ఎవరు గొప్ప నేత అంటే చంద్రబాబు అనే చెబుతారు. టీడీపీ - కాంగ్రెస్... చివరికి టీఆరెస్ లోని కొందరు నాయకుల నోటి నుంచి కూడా ఇలాంటి సమాధానం రావొచ్చు. కానీ.... చంద్రబాబు - కేసీఆర్ లలో సరైన నాయకుడు ఎవరని అడిగితే మాత్రం కేసీఆర్ పేరే చెబుతారు. చంద్రబాబు - కేసీఆర్ ఇద్దరు ప్రజాదరణ ఉన్న.. తెలివైన నేతలే. ప్రాంతం - పరిస్థితులు - రాజకీయాలు - ఆర్థిక వనరులు వంటి ఎన్నో అంశాల ప్రాతిపదికగా చూసుకుంటే రెండు రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులు ఉండొచ్చు కానీ... వాటిని డీల్ చేయడంలో మాత్రం ఎవరికైనా దాదాపుగా ఒకేలాంటి అవకాశాలే ఉంటాయి. అలా వనరులను - సమస్యలను డీల్ చేయడంలో ఎప్పటికప్పుడు సరైన అడుగులు వేస్తూ కేసీఆర్ దూసుకెళ్తుండగా ఉన్న అవకాశాలను కూడా సరిగా వినియోగించుకోక చంద్రబాబునాయుడు ప్రజలు - పార్టీ నేతల నుంచి అసంతృప్తి ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా సుమారు పదేళ్ల విరామం తరువాత అధికారం రావడంతో చాలామంది నేతలు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. కానీ, మంత్రి పదవులు వంటివి రకరకాల సమీకరణల నేపథ్యంలో కొందరినే వరించాయి. కానీ... ప్రభుత్వం అన్నాక ఇంకా ఎన్నో పదవులు ఉంటాయి. వాటిని భర్తీ చేస్తే ప్రతి జిల్లాలోనూ ముఖ్యమైన నేతలకు, పార్టీ కోసం కష్టించేవారికి న్యాయం చేసినట్లవుతుంది. కానీ, చంద్రబాబు వైపు నుంచి ఇంతవరకు అలాంటి ప్రయత్నమే కనిపించడం లేదు. శుష్క వాగ్దానాలే తప్ప చేతలన్నవి లేవు.
క్షేత్రస్థాయిలో నాయకులకు పదవులు, హోదాలు ఉంటే వారిలో కలిగే ఉత్సాహం వేరు. హోదా ఉంటే వారి వెనుక ఉండేవారిలోనూ అంతే ఉత్సాహం ఉంటుంది. కానీ, చంద్రబాబు మాత్రం నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టే పెట్టడం లేదు. ఇప్పటికి పరిమిత సంఖ్యలో పదవులనే భర్తీ చేశారు. పైగా ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే రెండేళ్లయింది.. ఈసరికే భర్తీ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.
ఇటీవల కడప జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని టీడీపీలోకి తెచ్చారు. ఆ సమయంలో ఆయన్ను రామసుబ్బారెడ్డి వ్యతిరేకించడంతో ఆయనకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. నిజానికి మూణ్ణాలుగు నెలలుగా నలుగుతున్న ఈ చేరిక ఇష్యూలో అప్పట్లోనే రామసుబ్బారెడ్డికి హామీ ఇచ్చారు. కానీ... ఇంతవరకు ఆయనకు పదవీయోగం పట్టలేదు. ఇలాంటి చర్యల వల్ల చంద్రబాబు మాటలపై నాయకుల్లో నమ్మకం పోతోంది. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నేతలు జిల్లాల స్థాయిలో తమ ఉనికి చాటుకునేందుకు ఉపయోగపడే నామినేటెడ్ పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ... చంద్రబాబు మాత్రం ఇప్పటికీ ఆ విషయం తేల్చలేదు. ఇది పార్టీకి, చంద్రబాబు పట్ల ఉన్న నమ్మకాన్ని దెబ్బ తీస్తోంది. ఈ విషయంలో చంద్రబాబు ఇకనైనా తేరుకుని జిల్లాల వ్యాప్తంగా పార్టీ కోసం పనిచేసేవారెవరో గుర్తించి ఇప్పటికైనా పదవీ యోగం పట్టిస్తే వచ్చే ఎన్నికల నాటికి ప్రజా వ్యతిరేకత, పార్టీలో వ్యతిరేకత రాకుండా ఉంటుంది. లేదంటే మాత్రం నష్టం తప్పదు.