పవర్ లో ఉన్న తమ్ముళ్లకు ఆర్థిక కష్టాలా?

Update: 2017-01-24 04:40 GMT
చేతిలో పవర్ ఉంటే ఆ హడావుడే వేరుగా ఉంటుంది. ఓపక్క తమ పనుల్ని దర్జాగా చేసుకుంటున్న ఏపీ అధికారపక్ష నేతలు మీడియా ముందుకు వచ్చినప్పుడు మాత్రం అందుకు భిన్నమైన మాటల్ని చెబుతున్నారు. రాజకీయాల్లో ఇలాంటి సాధారణమైన అంశాలే అయినా.. కేవలం రోజు వ్యవధిలో ఇద్దరు తెలుగు తమ్ముళ్లకు సంబంధించిన విషయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఏపీ పాలక పక్షానికి చెందిన ఇద్దరు ప్రముఖ నేతలు ఆర్థిక కష్టాల్లో ఉన్నట్లుగా చెప్పటం చూస్తే.. ఇది నిజమా అని అనుకోవాల్సిందే. ఇలాంటి కష్టాలు ఉన్న వారిలో ఒకరు కర్నూలు జిల్లాకు చెందిన భూమా నాగిరెడ్డి అయితే.. మరొకరు రాయపాటి సాంబశివరావుగా చెబుతున్నారు. తాను ఫైనాన్షియల్ గా బాగా ఇబ్బందుల్లో ఉన్నట్లుగా ఒక ఇంటర్వ్యూలో భూమా తనకు తానే స్వయంగా చెప్పుకొచ్చారు.

పవర్ లోఉన్న మీకు ఆర్థిక కష్టాలా? అన్న ప్రశ్నకు.. ఏం ఉండకూడదా? అని ఎదురు ప్రశ్నించారే తప్పించి.. తాను చెప్పిన మాటలో నిజం ఎంతుందో చెప్పే ప్రయత్నం చేయలేదు. భూమా మాటల్ని పక్కన పెడితే..ఆర్థికంగా ఆయన ఎంత సౌండ్ అన్నది అందరికి తెలిసిందే. కానీ.. ఆయన మాత్రం పేద మాటల్ని చెప్పి.. తనలోని ‘పేద’ కోణాన్ని ప్రదర్శించారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. మరో తెలుగు తమ్ముడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తున్న ఎంపీ రాయపాటికి చెందిన కంపెనీ రైతుల భూముల్ని డంపింగ్ యార్డుగా మార్చిందంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటల్ని విలేకరులు ప్రస్తావించినప్పుడు.. రాయపాటికి చెందిన కంపెనీలు అన్ని పనులు చేయటం లేదని.. వారు దెబ్బ తిన్నారంటూ చంద్రబాబు చెప్పటం గమనార్హం.  రాయపాటి కంపెనీతో పాటు మరికొన్నికంపెనీలు కూడా పనులు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. పవర్ లో ఉన్న తమ్ముళ్లు.. ఆర్థికంగా దెబ్బ తినటం ఏమిటి కామెడీ కాకపోతే? ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితే ఉంటే తెలుగు తమ్ముళ్లు అంత కూల్ గా ఉండగలుగుతారా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News