ఓటుకు నోటు వ్యవహారంలో వీడియో సాక్ష్యంతో అడ్డంగా దొరికిపోయారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ప్రతిఒక్కరూ అనుకునే మాట. కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అందుకు భిన్నమైన కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు.
తమను అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తున్న తెలంగాణరాష్ట్ర సర్కారు పప్పులు ఉడకవని చెబుతున్న చంద్రబాబు.. తన మంత్రివర్గ సహచరులతో సమావేశమైన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కాస్తంత ఆసక్తిని రేకెత్తించటం ఖాయం.
రేవంత్‌రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సర్కారు పెట్టించిన కేసులు నిలవవని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. చట్టప్రకారం చూస్తే.. ఈ కేసు నిలిచే అవకాశం తక్కువే అని ఆయన అభిప్రాపడుతున్నారు. ఓ పక్క చంద్రబాబును బ్రహ్మదేవుడు సైతం కాపాడలేరంటూ కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటే.. చంద్రబాబు మాత్రం సింఫుల్‌గా కేసు నిలవదని చెప్పటం కాస్త ఆసక్తి రేకెత్తించే మాటే.
మరి.. ఈ వ్యవహారంలో కేసీఆర్ చెప్పినట్లుగా జరుగుతుందా? లేదంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చేసిన సింఫుల్‌గా కేసు నుంచి రేవంత్ బయటపడతారా? చూడాలి. రేవంత్ కేసు దాకా ఎందుకు.. బాబు మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో సీడీ మాటేమిటి? ముందు దానికి సంబంధించి ఏసీబీ నోటీసులు అందుకుంటారా? విచారణను ఎదుర్కొంటారా? అన్న విషయాల మీద బాబు దృష్టి పెడితే బాగుంటుందేమో.