ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు ఇప్పుడు ఓ పట్టాన అర్థం కానట్లుగా మారుతోంది. తన గురించి తాను విపరీతంగా గొప్పలు చెప్పుకునే ఆయన.. అమరావతి నిర్మాణాల విషయంలో ఆయన అనుసరిస్తున్న విధానాలు చూస్తే నోట మాట రాదు. సినిమాలు తీసే దిగ్గజ దర్శకుడు రాజమౌళిని.. రాజధాని కట్టడాలకు సంబంధించిన డిజైన్లు ఇవ్వాలని కోరుతున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
బాహుబలి చిత్రంతో అంతర్జాతీయంగా తన ముద్ర వేసిన జక్కన్న అలియాస్ రాజమౌళిని అమరావతి నిర్మాణాలకు సంబంధించిన కట్టడాల డిజైన్ల గురించి ఆలోచించాలన్న విషయాన్ని తన తాజా నిర్ణయంతో చెప్పేశారు. ఇదే అంశంపై గతంలో ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి స్పందిస్తూ.. తానో సినిమా దర్శకుడ్ని అని.. ఏపీ రాజధాని అమరావతి నగరానికి డిజైన్లు వేయలేనని వినమ్రతతో చెప్పారు.
జక్కన్న చెప్పిన దాన్ని సగటుజీవి అర్థం చేసుకోగలరు. ఒక సినిమాకు సెట్టింగ్ రూపొందించటానికి.. ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణానికి డిజైన్లు ఇవ్వటానికి మధ్య పొంతన లేదన్నది మర్చిపోకూడదు. ఆ మాటకు వస్తే విఖ్యాత దర్శకుడు స్పీల్ బర్గ్.. రాజమౌళి కంటే అద్బుతమైన డిజైన్లు వేస్తారు. అంతమాత్రాన ఆయన్ను అమరావతి నగర నిర్మాణానికి సంబంధించి డిజైన్ల కోసం సంప్రదిస్తే బాగుంటుందా? అన్నది ప్రధాన ప్రశ్న. స్పీల్ బర్గ్ మాట ఎత్తిన వెంటనే నొసలు చిట్లించటం చాలామందిలో ఉంటుంది. అలాంటప్పుడు జక్కన్న సంగతేంటి? అన్నది ప్రశ్న.
ఆ మాటకు వస్తే.. బాహుబలి అంత కాకుండా.. తన పనితీరుతో తెలుగు ప్రజల్ని మెప్పించారు దర్శకుడు క్రిష్. బాలకృష్ణ వందో సినిమాను గౌతమీ పుత్ర శాతకర్ణిని అద్భుతంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
జక్కన్న మాదిరి ఎక్కువ సమయం తీసుకోకుండా తక్కువ బడ్జెట్ తో రిచ్ గా తీయటం క్రిష్ అలవాటు. ఆ లెక్కన అమరావతి డిజైన్ల విషయంలో రాజమౌళితో పాటు క్రిష్ ను కూడా పిలిస్తే బాగుంటుంది కదా? ఈ ప్రశ్న వేసిన వెంటనే ఎటకారమా? అన్న డౌట్ వస్తుంది. డిజైన్ల కోసం రాజమౌళిని పిలవటంలో ఎగతాళి లేకుంటే.. క్రిష్ ను కూడా పిలవాలన్న మాటలోనూ ఎగతాళి లేదన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.