ఆచితూచి ముందుకెళ్లే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేయకూడని తప్పు చేస్తారా? అన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రామోజీ గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావును ఆహ్వానించేందుకు ఫిలింసిటీకి వెళతారన్నది తాజా కబర్. సోమవారం ఆయన రామోజీఫిలిం సిటీకి వెళ్లి.. స్వయంగా పిలుస్తారని చెబుతున్నారు.
ఒకవేళ అదే జరిగితే చంద్రబాబు కోరి కష్టాలు నెత్తి మీదకు తెచ్చుకున్నట్లేనన్న వాదన వినిపిస్తోంది. రామోజీరావును ఆహ్వానించేందుకు చంద్రబాబు కానీ ఆయన వద్దకు వెళితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బ తినటం ఖాయమని చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో పవన్.. అవుట్ అండ్ అవుట్ మోడీ.. బాబు తరఫున ప్రచారం చేయటం తెలిసిందే.
పవన్ తెర మీదకు వచ్చి మోడీ.. బాబులకు ప్రచారం చేయటం ఏపీలో ఎంతగానో లాభించిందన్న విషయం చిన్న పిల్లాడికి కూడా తెలుసు. బాబు గెలుపుకోసం స్వార్థం లేకుండా కష్టపడిన పవన్ కల్యాణ్ ను రాజధాని శంకుస్థాపనకు స్వయంగా ఆహ్వానించని చంద్రబాబు.. రామోజీరావును పిలవటానికి రామోజీ ఫిలిం సిటీకి ఎలా వెళతారన్న ప్రశ్న వినిపిస్తోంది. ఒకవేళ.. బాబు కానీ రామోజీ ఫిలింసిటీకి వెళితే..పవన్ కల్యాణ్ ను అభిమానించేవారంతా బాబుపై గుర్రు పెట్టుకోవటం ఖాయమంటున్నారు. పవన్ కున్న ప్రజాదరణ చంద్రబాబుకు తెలీదా? తెలిసి మరీ చంద్రబాబు తప్పు చేస్తారా? ఒకవేళ అదే జరిగితే.. పిలుపుల వ్యవహారం కాస్త ‘పంచాయితీ’గా మారటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.