చంద్రబాబుని అందుకే రాజకీయ గండర గండడు అన్నారు. ఆయనను అపర చాణక్యుడు అని కూడా అన్నారు. ఆయనకు చాలా బాగా తెలుసు. ఏపుడేమి మాట్లాడాలో. ఎవరిని ఎలా వంచాలో కూడా. ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. అంగబలం, అర్ధబలం కూడా దండీగా ఆ పార్టీకి ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గట్టిగానే పోరాడుతుంది. ఒక విధంగా చెప్పాలీ అంటే ఆ ఎన్నికలు ఆషామాషీగా అసలు జరగవు. ఇంతకు ముందు ఎన్నికలకు కూడా పోలిక పెట్టడానికి అసలు వీలు ఉండదు.
జగన్ సీఎం కావాలని పదేళ్ళు పంతం పట్టి తన కోరిక నెరవేర్చుకున్నారు. అలాంటి జగన్ అంత సులువుగా అధికారం వదులుకుంటారు అనుకోవడం పొరపాటే. ఆ సంగతి అందరి కంటే ఎక్కువ చంద్రబాబుకే తెలుసు. అందుకే ఆయన ఏపీలో వైసీపీది అరాచక పాలన అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ పాలన పోవాలని కూడా గట్టిగా పిలుపు ఇస్తున్నారు.
అంతే కాదు, వైసీపీని దించాలీ అంటే అంతా కలసి చేతులు కలపాలి అని ఓపెన్ గానే పిలుపు ఇస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు పొత్తుల గురించి మాట్లాడుతూనే ఒక మాట అంటున్నారు. అది లాజిక్ తో కూడుకున్నది కావడం విశేషం. రాష్ట్ర ప్రయోజనాల కోసం అంతా చేతులు కలపాలని బాబు కోరుతున్నారు. రాజకీయ ప్రయోజనాలు అని ఆయన ఎక్కడా అనడంలేదు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలీ అంటే అంతా ఒక్క త్రాటి మీద వైసీపీకి యాంటీగా అడుగులు వేయాలని కూడా ఆయన కోరుతున్నారు. అదే సమయంలో పొత్తులు లేకుండా గెలిచిన చరిత్ర టీడీపీకి ఉంది అని చెబుతున్నారు. అంటే తాము వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామని, జనాలు మద్దతు ఇవ్వాలని ఒకవైపు అప్పీల్ చేసుకుంటూనే మిగిలిన పార్టీలు కూడా కలసి రావాలని బాబు కోరడంలోనే చాణక్యం ఉంది.
ఇదే సమయంలో మిగిలిన పార్టీలు రాజకీయ కారణాలు వల్ల కానీ, సీట్ల తేడాతో కానీ సీఎం పోస్టు వంటి వాటి విషయంలో విభేదించడానికి వీలు లేకుండా ముందర కాళ్లకు బాబు బంధం వేస్తున్నారు. ముందు ఏపీ అభివృద్ధి ఫస్ట్. రాజకీయాలు సెకండ్ అంటున్నారు. ఆ విధంగా జనాలను తన వైపు తిప్పుకుంటున్నారు.
ఏపీ జనాలు ఈసారి ప్రయోగాలు చేయడానికి అసలు సిద్ధంగా లేరు కాబట్టి తనకే పట్టం కడతారని, ఆ విధంగా వారిని డ్రైవ్ చేయడానికి బాబు చూస్తున్నారు. అదే సమయంలో పొత్తుల కోసం మిత్రులు కావాలని కోరుతున్నారు. ఒకవేళ ఆ పార్టీలు కలసి వస్తే ఓకే. లేకపోతే ఏపీ జనాలు తన వైపే ఉండేలా బాబు మార్క్ అభివృద్ధి ప్లాన్ ఎటూ ఉంది. మరి బాబుని పొత్తుల పేరిట లొంగదీయాలని, ఎక్కువ సీట్లకు బేరాలు చేయాలని ఏ పార్టీ అయినా అనుకుంటే అది తప్పే అవుతుంది. ఆ విధంగా బాబు పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు. మొత్తానికి చంద్రబాబు లాజిక్ తో కొడుతున్నారు.
ఇవాళ ఎవరైనా ఉహూ అన్నా ఎన్నికల ముందు అయినా అన్ని పార్టీలూ టీడీపీని పెద్దన్నగా భావించి అనుసరించకతప్పదని అంటున్నారు. మొత్తానికి టీడీపీ నాయకత్వంలోనే కూటమి ఏర్పడుతుందని, మిగిలిన పార్టీలు కూడా తలా చేయీ వేయాల్సిన రాజకీయ అనివార్యత ఉంటుందని అంటున్నారు. సో చూడాలి మరి ఏం జరుగుతుందో.