చుట్టూ ప్రతకూల పరిస్థితులు ఉన్నప్పుడు చిరాకు మామూలే. అందుకు ఏపీ ముఖ్యమంత్రి సైతం మినహాయింపు కాదన్న విషయం ఈ మధ్యన తరచూ అర్థమవుతున్న పరిస్థితులు. చుట్టూ ఉన్న ఇబ్బందికర పరిస్థితులతో పాటు.. పీకల్లోతు ఆర్థిక కష్టాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి తరచూ తన సహచరులు. అధికారులపైన మండిపడటం కనిపిస్తోంది. అధికారం చేపట్టిన మొదట్లో ఉన్న బ్యాలెన్స్ ను ఈ మధ్యన మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన ఏపీ మంత్రిని ఒకరిని పొగడ్తలతో ముంచెత్తారు. తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశం సందర్భంగా కృష్ణా జలాల విషయంలో ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల మధ్య నడుస్తున్న పంచాయితీల్లో భాగంగా ఇటీవల కేంద్రంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు ధీటుగా ఏపీ మంత్రి దేవినేని ఉమ వాదనలు వినిపించటం.. ఏపీ వైఖరిని స్పష్టం చేయటంతో పాటు.. తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ.. తొండి వాదంతో వెళుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేసిన వైనాన్ని చంద్రబాబు మెచ్చుకున్నట్లుగా చెబుతున్నారు.
మంత్రివర్గ సమావేశంలో దేవినేని పనితీరును ప్రత్యేకంగా ప్రస్తావించి.. ఢిల్లీ ఎపిసోడ్ లో ఆయన సమర్థంగా వ్యవహరించటాన్ని తోటి మంత్రులకు చెబుతూ.. దేవినేని మీద ప్రశంసల జల్లు కురిపించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల వరుస క్లాస్ లతో మంత్రుల మనోధైర్యాన్ని దెబ్బ తీసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్న వాదనకు భిన్నంగా దేవినేనిని పొగడటాన్ని విశేషంగా చెబుతున్నారు. బాబు ప్రశంసలు దేవినేనితో పాటు ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శితో పాటు ఇతర అధికారుల పనితీరును ప్రత్యేకించి మెచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఇరిగేషన్ వ్యవహారాల్లో మాంచి పట్టున్న తెలంగాణ మంత్రి హరీశ్ రావుతో వాదనతో పోటీ పడటం.. తెలంగాణను తప్పు పట్టే వాదనను సమర్థవంతంగా తెర మీదకు తీసుకురావటం అంత తేలికైన వ్యవహారం కాదుగా.