మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేలంతా తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తుంటే సీనియర్ ఎమ్మెల్యే ఒకరు బాబుకు తెగ నచ్చేశారు. మంత్రి పదవి దక్కకపోయినా బాగా వ్యవహరించారని ప్రశంసలు పొందారు. ఆయనే ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. తాజాగా సచివాలయంలో సీఎం చంద్రబాబుకు సచివాలయంలో యరపతినేని తారసపడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనతో మాట్లాడుతూ సామాజిక సమీకరణాల వల్ల నీకు అవకాశం కల్పించలేకపోయానని, మంత్రి పదవి రాకపోయినప్పటికీ హుందాగా వ్యవహరించావని అభినందించారు. ఏ సమస్య వచ్చిన అండగా ఉంటానని యరపతినేనికి చంద్రబాబు హామీ ఇచ్చారు.
-- ఇంకో ఎమ్మెల్యే సైతం బాబుకు ఊరట కలిగించే మాట చెప్పారు. అందరికీ మంత్రి పదవులు ఇవ్వడం ఎవరికీ సాధ్యం కాదని తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కేబినెట్ విస్తరణ జరిగిన నేపథ్యంలో ఎమ్మెల్యేల అసంతృప్తిపై మీడియాతో రాజా మాట్లాడుతూ రెండు, మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారని, ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలో సీఎం చంద్రబాబుకు తెలుసని చెప్పారు.
-- ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తీరుపట్ల సీఎం చంద్రబాబునాయుడు అసంతృప్తి చెందారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రి పదవి అడగటం భావ్యమా అని ప్రశ్నించారు. ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యతను సీఎం ఉమకు గుర్తుచేశారు. కాపు సామాజికవర్గానికి చెందిన ఐదుగురికి మంత్రి పదవులు ఇచ్చామన్నారు. టీడీపీలో క్రమశిక్షణ ముఖ్యమని బోండా ఉమకు చంద్రబాబు స్పష్టం చేశారు.
--వివిధ సమీకరణల వల్ల బోండాకు మంత్రి పదవి ఇవ్వలేకపోయినట్లు సీఎం చంద్రబాబు తెలిపారని ఎంపీ కేశినేని నాని తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… పార్టీ కోసం పనిచేస్తున్న బోండా ఉమాను చంద్రబాబు అభినందించారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బోండా ఉమా ఎంతో కష్టపడ్డారని అభినందించారు. 10రోజుల్లో బోండా ఉమాకు సరైన న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారని కేశినేని తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/