ఎన్నికలకు సమయం దగ్గర పడేకొద్దీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులో అసహనం పెరిగిపోతుంది. దీంతో ఏపీ ప్రజల్లో ఎలాగైనా సరే సెంటిమెంట్ ను రెచ్చగొట్టి మరీ ఓట్లని సంపాదించాలని చూస్తున్నారు. మొన్నటివరకు తెలుగు ప్రజలకు బండబూతులు తిట్టిన కేసీఆర్ తో జగన్ చేయికలిపాడని విమర్శించారు. అంతేకాకుండా మన రాజధాని లాక్కున్నారని సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు.
ఇన్నాళ్లు కేవలం ఆత్మగౌరవం నినాదంతో సెంటిమెంట్ వర్కవుట్ చేయాలని ప్రయత్నించారు చంద్రబాబు. అయితే.. అది అంతగా వర్కవుట్ అవుతున్నట్లు ఆయన అన్పించలేదు. రోజురోజుకి తెప్పించుకుంటున్న రిపోర్టుల్లో కేసీఆర్ పై ఎక్కడా తెలుగు ప్రజల్లో వ్యతిరేకత కన్పించడం లేదు. దీంతో.. చంద్రబాబు ఇప్పుడు రూట్ మార్చారు. సాగునీటి ప్రాజెక్టుల సెంటిమెంట్ ని అందుకున్నారు.
కర్నూలు జిల్లా నందికొట్కూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు. ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఏపీ ప్రాజెక్టులన్నీ కేసీఆర్ హస్తగతమవుతాయన్నారు. జగన్ అధికారంలోకి వస్తే కాల్వల్లో పారేది నీరు కాదని - కన్నీరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీని ప్రత్యేక హోదా అడిగితే ఎదురు దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంపదను ప్రజలకు పంచుతుంటే వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మచ్చుమర్రి - పోతిరెడ్డి పాడులను మూసివేయాలని కేసీఆర్ కోరుతున్నారని - అవి మూసేస్తే రాయలసీమ ఎడారి అవుతుందన్నారు. ప్రధాని మోదీని చూస్తే వైసీపీ అధినేత జగన్‌కు భయమని - అందుకే ఏపీ ప్రజలను తాకట్టు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు.