భేష్; రాజమండ్రి కాదు..ఇక రాజమహేంద్రవరం

Update: 2015-07-26 04:12 GMT
‘‘వేదంలా ఘోషించే గోదావరి.. అమర నాదంలా శోభిల్లే రాజమహేంద్రి.. రాజ రాజ నరేంద్రుడి..’’ అంటూ సాగే పాటను విన్న ప్రతి తెలుగోడి రోమాలు నిక్కబొడుచుకోవటం.. గర్వంతో ఛాతీ ముందుకు రావటం.. భావోద్వేగంతో ఊగిపోవటం మామూలే. నాటి రాజమహేంద్రనగరిని రాజమండ్రిగా మార్చేసి ఆత్మలేకుండా చేశారన్న దిగులు ఇక తీరనుంది.

గోదావరి మహా పుష్కరాల సందర్భం గా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేషైన నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రికి రాజమహేంద్రవరం అన్న పేరు పెట్టాలని నిర్ణయించినట్లుగా ప్రకటించారు. చరిత్రరోజుల్లోనే అద్భుతమైన సాంస్కృతిక రాజధానిగా విరసిల్లిన రాజమహేంద్రవరం పూర్వవైభవాన్ని తిరిగి తీసుకొస్తామన్న చంద్రబాబు అందులో భాగంగా.. తొలి అడుగుగా రాజమండ్రి పేరు మార్చనున్నట్లు పేర్కొన్నారు.

ఉద్యోగాల కోసం ఇప్పటివరకూ రాజమండ్రి నుంచి వెళ్లిన వారు.. ఇకపై రాజమహేంద్రవరానికి అనేక మంది ఉద్యోగాల కోసం వచ్చేలా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. తెలుగువారి జీవనాడిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్ చంద్రబాబు.. అఖండ గోదావరి పేరిట టూరిజం హబ్ గా మారుస్తామని ప్రకటించారు.

వీటీ కళాశాల..టౌన్ హాల్.. దామెర్ల రామారావు అర్ట్ గ్యాలరీ.. గౌతమి గ్రంథాయలాలను అభివృద్ధి చేస్తామని.. కలకాలం గుర్తుండిపోయేలా రాజమహేంద్రవరాన్ని రూపొందిస్తామని ప్రకటించారు. మొత్తానికి చరిత్ర పాఠాల్లో మాత్రమే కనిపించే రాజమహేంద్రవరం పేరు.. మరోసారి అధికారికంగా రాజమండ్రి స్థానాన్ని అక్రమించటానికి మించిన సంతోషం ఏముంటుంది.
Tags:    

Similar News