40 ఇయర్స్ ఇండస్ట్రీ - ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు పెళ్లిరోజు ఈరోజే. అందుకే ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబర్ 10 - 1981లో చంద్రబాబు-భువనేశ్వరిల వివాహం జరిగింది. తాజాగా ఆయన కుమారుడు - టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్విట్టర్ సాక్షిగా అరుదైన ఫొటోను షేర్ చేసి తన తల్లిదండ్రులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో మోడ్రన్ స్టైల్లో హ్యాపీగా నడుచుకుంటున్న వెళ్తున్న చంద్రబాబు-భువనేశ్వరీల ఫొటోను ట్వీట్ చేశారు. అది వైరల్ అయ్యింది.
అయితే భువనేశ్వరితో పెళ్లి ఎలా జరిగింది.? ఎన్టీఆర్ ఎలా పిల్లను ఇచ్చారనే విషయంపై చంద్రబాబు గతంలో ఆసక్తికరంగా సమాధానాలిచ్చారు. అసలు భువనేశ్వరితో పెళ్లి ప్రతిపాదనను తొలుత తెచ్చింది ఎన్టీఆరేనని చంద్రబాబు వివరించారు.
నాడు ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్న తనకు భువనేశ్వరిని ఇచ్చి పెళ్లి చేసేందుకు ఎన్టీఆర్ వైపు నుంచే ప్రతిపాదన వచ్చిందని చంద్రబాబు తెలిపారు. తాను మాత్రం కొంచెం మొదట్లో బెట్టు చేశానని.. పెద్ద వాళ్లతో మాట్లాడి చెబుతానని ఆలస్యం చేసినట్టు చంద్రబాబు తెలిపారు. చివరకు పెళ్లి చూపులకు ఒప్పుకొని వెళ్లగా భువనేశ్వరితో మాట్లాడాకా పెళ్లికి ఓకే చెప్పానని బాబు గుర్తు చేసుకున్నారు. ‘పల్లెటూరిలో పెరిగిన నాకు మంత్రి పదవి పోతే మళ్లీ పల్లెటూరిలోనే ఉంటానని.. నువ్వు ఉంటావా’ అని భువనేశ్వరిని అడిగానని.. ఆమె ఓకే అనడంతో పెళ్లికి ఒప్పుకున్నానని బాబు వివరించాడు.
ఇక ఎన్టీఆర్ తాను కట్నం ఏదీ ఇవ్వాలని కోరలేదని.. కేవలం తన పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలని మాత్రమే కోరినట్టు చంద్రబాబు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. చెన్నైలోని కళైవానర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించిన తమ పెళ్లికి అందరినీ ఆహ్వానించిన మేరకు చిత్తూరు జిల్లా నుంచి ఇంటికొకరు భారీగా తరలిరావడం ఆనందాన్ని ఇచ్చిందని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి వచ్చి పార్టీపెట్టాలని కోరానని బాబు వివరించారు. కానీ ఎన్టీఆర్ పార్టీ పెట్టాక ఆరంభంలోనే తనను పార్టీలోకి తీసుకోలేదని బాబు చెప్పుకొచ్చాడు.