ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాలు కొన్ని చిత్ర..విచిత్రంగా ఉంటాయి. విపక్షంలో ఉన్నప్పుడు ఆయన తరచూ పలువురు సీనియర్ జర్నలిస్టులతో భేటీ అయ్యేవారు. ఇష్టాగోష్ఠి పేరిట మీడియా ప్రతినిధితులతో అందుబాటులో ఉండే ఆయన.. ఫీడ్ బ్యాక్ పేరిట క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేసే వారు. ఈ సందర్భంగా అతి కొద్దిమంది సీనియర్ పాత్రికేయులు మాత్రమే ఆయనకు ఉన్నది ఉన్నట్లుగా ‘విషయాలు’ చెప్పేవారు. దీంతో బాబుకు తాను చేస్తున్న తప్పుఒప్పుల గురించిన సమాచారం ఎప్పటికప్పుడు అర్థమయ్యేది. పదేళ్లు విపక్ష నేతగా వ్యవహరించిన ఆయన.. ఎక్కువ భాగంగా ఇలాంటి తీరునే ప్రదర్శించిన ఆయన.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ అలవాటు బాగా తగ్గించేశారు.
విపక్ష నేతగా ఉండే తీరికను.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకుండే బిజీబిజీ షెడ్యూల్ ను అర్థం చేసుకునే వీలున్నా.. ఫీడ్ బ్యాక్ అందించే వారి విషయంలో ఆయన అనుసరిస్తున్న ధోరణి పట్ల చాలామంది పాత్రికేయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సుదీర్ఘ కాలం తర్వాత అధికారంలోకి రావటం..ఏదేదో చేసేయాలన్న తపన కారణంగా..ఆయన నిత్యం వ్యవస్థను పరిగెత్తించే పేరిట గంటల కొద్దీ కాలాన్ని గడిపేస్తున్నారు. సమీక్షల పేరిట.. ఆయన చేసే వృధా అంతా ఇంతా కాదు. గడిచిన రెండున్నరేళ్లుగా అదే తంతు. నిత్యం తన చుట్టూ ఉండే అధికార గణం.. రాజకీయ నేతలతో కూడిన సందడి వాతావరణంలో తాను చేస్తున్న వృధా సమయం ఎంతన్నది బాబు ఎరుకకు రాని పరిస్థితి.
దీంతో.. ఆయనకు ఫీడ్ బ్యాక్ ఇచ్చే వారిలో కొద్దిమంది ఆయన్ను గతంలో మాదిరి కలిసే పరిస్థితే లేకుండా పోయింది.దీంతో.. గ్రౌండ్ లెవెల్లో చంద్రబాబు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే వీల్లేని పరిస్థితి. ఇలాంటి వేళ.. ప్రముఖ దినపత్రికల్లో ఒకటైన ఆంధ్రజ్యోతిలో ఇటీవల బాబు అనుసరిస్తున్న వైఖరిలోని లోపాల్ని ప్రస్తావిస్తూ ఆ మీడియా సంస్థ యజమాని తాను వారాంతంలో రాసే కాలమ్ లో బాబు తీరును తప్పు పడుతూ వివరంగా ఒక వ్యాసం రాశారు. గతంలో ఇవే విషయాల్ని పలువురు చెప్పేందుకు ప్రయత్నించినా.. బాబు దగ్గరకు ఆయన సన్నిహిత వర్గాలు దగ్గరకు రానివ్వలేదు. గుట్టుగా తన తీరును మార్చుకోవాల్సిన బాబు.. చివరకు పబ్లిక్ గా చెప్పించుకున్న దుస్థితి. మొన్న రాసిన కాలమ్ కు ఎఫెక్ట్ అన్నట్లుగా.. తాజాగా తాను రోజువారీగా నిర్వహించే సమీక్షలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
నిన్నటివరకూ నిర్వహించే వన్ సైడ్ టెలీ కాన్ఫరెన్స్ ల్ని తగ్గించేయటం.. పొద్దుపొద్దున్నేనిర్వహించే సమీక్షలకు చెక్ చెప్పి..15 రోజులకు ఒక మారు మాత్రమే టెలీ కాన్ఫరెన్స్ లు నిర్వహించాలని డిసైడ్ చేశారు. చంద్రబాబు ఇలా రియాక్ట్ అయ్యారో లేదో..ఆ వెంటనే ఆ మీడియా సంస్థ తాను చేసిన సూచనపై ముఖ్యమంత్రి స్పందించిన తీరును ప్రచారం చేసుకోవటం మొదలుపెట్టింది. ఇదంతా చూసిన చాలా మంది మదిలో మెదిలిన సందేహం ఒక్కటే.. బాబు తీరు మార్చటమే లక్ష్యమైన పక్షంలో.. ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూల పేరిట కలిసే సందర్భంలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పాల్సింది పోయి.. పవర్ లోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత బాబు తప్పుల్ని పబ్లిక్ గా ఎత్తి చూపి మరీ..మార్చాల్సిన అవసరం ఉందా? అన్నది ఒకటైతే.. బాబు చుట్టూ నిత్యం కమ్ముకొని ఉండే ‘సన్నిహిత’ వర్గం ఇలాంటి వాటి విషయాల్ని అధినేత దృష్టికి సూచనప్రాయంగా ఎందుకు తీసుకెళ్లనట్లు? అన్నది మరొకటి. అంటే.. బాబు చుట్టూ నిత్యం ఉండే వారికి బాబు క్షేమాన్ని కాంక్షించే వారు కాదా..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/