తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు సాటి తెలుగు రాష్ర్టం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును ఆహ్వానించకపోవడం చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. దీనిపై రెండు రాష్ర్టాల ప్రభుత్వాల నుంచి ఇంతకుముందు ఎవరూ మాట్లాడలేదు. అయితే... తాజాగా చంద్రబాబు దీనిపై స్పందించారు. తనకు ఆహ్వానం రాకపోవడం నిజమేనని.. అయితే, అందుకు తానేమీ ఫీల్ కావడం లేదని చెప్పారు. తెలుగు భాషకు గౌరవం దక్కడం ఆనందాన్ని కలిగిస్తోందని, తనకు ఆహ్వానం అందకపోయినా ఫరవా లేదన్నారు. తెలుగు భాషను అందరూ గౌరవించాలని అన్నారు. తెలుగు భాషను కాపాడుకునేందుకు జరిగే ఏ కార్యక్రమమైనా టీడీపీ మద్దతు ఇస్తుందన్నారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా కలిసి ఉండాలన్నదే తమ అభిమతమన్నారు.
కాగా హైదరాబాద్ లో నిర్వహించిన ఈ ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా ప్రారంభించారు. దేశవిదేశాల నుంచి 8వేల మందికిపైగా ప్రతినిధులతో ఎల్బీ స్టేడియం కిక్కిరిసిపోయింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగు సభలకు ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రముఖులను ఆహ్వానించినా పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును మాత్రం ఆహ్వానించలేదు.
కాగా తెలుగు సభలను తనను ఆహ్వానించనప్పటికీ చంద్రబాబు ఇంత హుందాగా దానిపై స్పందించడాన్ని అభిమానులు గొప్పగా చెబుతున్నారు. తనను గౌరవించకపోయినా ఫర్వాలేదు, భాషను గౌరవిస్తే చాలంటూ బాబు తన హుందాతనాన్ని చాటారని వారు అంటున్నారు. అదేసమయంలో కొందరు మాత్రం చంద్రబాబుపై సెటైర్లు వేస్తున్నారు. ముందు రోజే తెలంగాణ మంత్రి కేటీఆర్ చంద్రబాబుకు భారీ సర్టిఫికెట్ ఇచ్చారని... హైదరాబాద్ అభివృద్ధి క్రెడిట్ ఇచ్చారని... ఆ గోళీ దెబ్బకు చంద్రబాబు పాపం ఈ అవమానాన్ని కూడా చాలా లైట్ గా తీసుకున్నారని.. కేటీఆర్ గోళీ బాగా పనిచేసిందని సెటైర్లు వేస్తున్నారు.