భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు - విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అంటే.. భాజపాలో చంద్రబాబు అనుకూల వ్యక్తుల్లో ఆయన ఒకరు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ముమ్మరంగానే ఉంది. అయితే శనివారం నాడు విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన హరిబాబు చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఈ వ్యాఖ్య చంద్రబాబు మీద హరిబాబు చేసిన చాలా పెద్ద వెటకారం గా పలువురు భావిస్తున్నారు.
ఇంతకూ ఏం జరిగిందటే.. విశాఖ భాగస్వామ్య సదస్సు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలోనే జరుగుతోంది. ఈ సదస్సుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. విభజన హామీలన్నీ అమలు చేస్తాం అని ఎప్పటిలాగా చెప్పిన హరిబాబు.. ఇలాంటి భాగస్వామ్య సదస్సులు పెద్దగా సక్సెస్ కావు అని పెదవివిరుపుతో మాట్లాడడం గమనార్హం.
ఒకవైపు ఈ సభ ప్రసంగంలో చంద్రబాబునాయుడు.. ఇప్పటిదాకా 13.54 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు జరిగాయంటూ చాలా ఘనంగా టముకు వేసుకుంటూ.. అవన్నీ నిజమైతే 31 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పారు. ఆ ఒప్పందాల్లో 59 శాతం వాస్తవ రూపం దాలుస్తున్నాయని చంద్రబాు చెప్పుకొచ్చారు. అయితే కంభంపాటి హరిబాబు మాత్రం.. ఇలాంటి సదస్సుల్లో జరిగే ఒప్పందాల్లో గరిష్టంగా 15 శాతం మాత్రం మెటీరియలైజ్ అవుతాయని చెప్పడం విశేషం.
‘రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో న్యాయం జరిగిందనే అభిప్రాయం వచ్చాక జరుగుతున్న సదస్సు ఇది’ అంటూ హరిబాబు చెప్పిన సంగతి వింటోంటే.. కేంద్రం న్యాయం చేసింది అని చంద్రబాబు భావిస్తున్నందుకు ప్రతీకగా భాజపా దళాలు ఈ సదస్సును అభివర్ణించడానికి ప్లాన చేసినట్లు తెలుస్తోంది. అదేసమయంలో ఇది ‘సూర్యుడికి చంద్రుని శక్తిని తెలిపే సదస్సు’ ఇది అని ఆయన అభివర్ణించారు.
ఈ కామెంట్ మీదనే తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఈ వాక్యంలో చంద్రుడంటే చంద్రబాబునాయుడే అని అర్థమవుతుంది. ఆయన శక్తిని కేంద్రానికి ఈ సదస్సు తెలియజెబుతుంది అని కూడా తెలుస్తోంది. అయితే,.. ఈ మాట ద్వారా సూర్యుడి వంటి నరేంద్ర మోడీకి.. చంద్రుడి చంద్రబాబు శక్తి తెలుస్తుందని అన్నట్లుగా ఉంది. సూర్యుడి ముందు చంద్రుడు అసలు శక్తి హీనుడు. చంద్రుడికి ఎన్నటికీ ఎలాంటి వెలుగూ ఉండదు.. కేవలం సూర్యుడి కాంతి పడి పరావర్తనం చెందడం వల్ల మాత్రమే కాస్త వెలుగుతున్నట్లుగా కనిపిస్తాడు. అంటే చంద్రబాబు కూడా సూర్యుడిలాంటి మోడీ వెలుగు తన మీద ఉన్నంతవరకే వెలుగుతాడని.. లేకపోతే మసకబారిపోతారని హరిబాబు అంటున్నట్టుగా ఈ వ్యాఖ్య ఉన్నదని అంతా అనుకుంటున్నారు.