టైం లేదంటూ గొట్టిపాటికి షాకిచ్చిన బాబు?

Update: 2017-05-24 04:51 GMT
అనుకోని రీతిలో ఏదైనా జ‌రిగిన‌ప్పుడు వెనువెంట‌నే అధినేత‌ను క‌లుసుకోవాల‌నుకోవ‌టం మామూలే. సాదాసీదా కార్య‌క‌ర్త కాకుండా ఏకంగా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్య‌క్తి అనుకున్న‌ప్పుడు అధినేత వెంట‌నే క‌ల‌వ‌టం.. ఇష్యూను చ‌ర్చించ‌టం.. ప‌రిష్కారం వెత‌క‌టం లాంటివి మామూలే. కానీ.. అందుకు భిన్నంగా చోటు చేసుకున్న వైనం టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ ను తెగ ఇబ్బంది పెట్టేస్తుంద‌ని చెబుతున్నారు.

ప్ర‌కాశం జిల్లా పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌ల సంద‌ర్భంగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై గొట్టిపాటి.. సీఎం చంద్ర‌బాబును క‌ల‌వాల‌ని అనుకున్నారు. క‌ర‌ణంతో త‌న‌కు జ‌రిగిన ఫైటింగ్ నేప‌థ్యంలో బాబును క‌లిసి.. త‌న‌కు జ‌రుగుతున్న అన్యాయం గురించి గ‌ట్టిగా నిల‌దీయాల‌ని అనుకుంటున్న‌ట్లుగా చెబుతున్నారు. గొడ‌వ‌ప‌డి.. ప‌ర‌స్ప‌రం తోపులాట‌.. చొక్కాలు చిరిగే వ‌ర‌కూ విష‌యం వెళ్లిన నేప‌థ్యంలో అధినేత‌ను క‌లిసి.. ఏం జ‌రిగింద‌న్న విష‌యాన్ని చెప్పేందుకు వీలుగా మంగ‌ళ‌వారం సాయంత్రం బాబు టైం అడిగిన‌ట్లుగా గొట్టిపాటి చెప్పారు.

అయితే.. స‌మ‌యం లేని కార‌ణంగా గొట్టిపాటికి అపాయింట్ మెంట్ ఇవ్వ‌లేదు బాబు. ముఖ్య‌మంత్రి బిజీగా ఉన్నార‌ని.. క‌ల‌వ‌టం కుద‌ర‌ద‌ని ముఖ్య‌మంత్రి కార్యాల‌య అధికారులు చెప్ప‌టంతో.. సీఎం టైం కోసం గొట్టిపాటి వెయిట్ చేస్తున్నారు. ఇవాళ కాకున్నా రేపు అయినా స‌రే చంద్ర‌బాబును క‌లిసి తీరాల‌ని గొట్టిపాటి బ‌లంగా అనుకుంటున్న‌ట్లు తెలిసింది. ఒక‌వేళ త‌న‌కు టైం ఇవ్వ‌క‌పోతే.. బుధ‌వారం తెలంగాణ‌లో జ‌రిగే టీడీపీ మ‌హానాడుకు బాబు హాజ‌రు కానున్నారు. దీనికి వెళ్లి అయినా స‌రే.. అక్క‌డే ఆయ‌న్ను క‌ల‌వాల‌ని గొట్టిపాటి గ‌ట్టిగా అనుకుంటున్న‌ట్లు తెలుస్తుంది. మ‌రి.. అక్క‌డైనా త‌న గోడును వెళ్ల‌బోసుకునేందుకు గొట్టిపాటికి అవ‌కాశం ల‌భిస్తుందా?
Tags:    

Similar News