రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం పోలేదంటున్నారు తెలుగు మీడియాలోని ఎడిటర్లు, సబ్ ఎడిటర్లు. ఎందుకో తెలుసా... ? చంద్రబాబు ఊకదంపుడు ప్రసంగాలను దిద్దీ దిద్దీ విసిగిపోయిన వారంతా ఆయన ఎప్పుడైనా ఏదైనా కొత్త విషయం చెబితే ప్రచురిద్దామని చాలా ఆశగా ఉన్నారట. కానీ... రెండున్నరేళ్లుగా ఆ పాచిపళ్ల దాసరి పాడిన పాటే పాడుతుంటే ఎక్కడ కుదురుతుంది? అలా చాలాకాలంగా నిరీక్షిస్తున్న మన తెలుగు మీడియా రంగం కొద్దిరోజులుగా తమ ఆశ తీరుతుందని భావించింది. డీమానిటైజేషన్ పై వేసిన సీఎంల కమిటీకి చంద్రబాబుకు సారథ్య బాధ్యతలు అప్పగించడంతో ఆయన ఈసారి కొత్తగా ఏదైనా మాట్లాడుతారని, పాత ప్రసంగాలనే మళ్లీ మళ్లీ అచ్చేసే బాధ తప్పుతుందని అనుకున్నారు. కానీ.... అక్కడ ఉన్నది చంద్రబాబు... ముంబయిలో ముఖ్యమంత్రుల హైలైవెల్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఆ తరువాత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి.. మళ్లీ మన గల్లీ ముచ్చట్లన్నీ మాట్లాడేశారు. ఏపీలో తానేం చేశానో.. చేస్తున్నానో ఘనంగా డప్పుకొట్టేశారు. పాపం మన మీడియా కోరిక నెరవేరలేదు. అందుకే వారంతా చంద్రబాబు రామేశ్వరం వెళ్లినా మనకు ఈ శనీశ్వరం తప్పలేదు అనుకుంటూ కళ్లు మూసుకుని చంద్రబాబు పాత పాటనే అచ్చేయాల్సి వచ్చింది.
సీఎంల కమిటీ భేటీ తరువాత చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ ఏపీలో తాను అమలు చేస్తున్న సాంకేతిక పథకాల లిస్టు చదివేశారు.
- ప్రతి ఇంటికీ 15 ఎంబీపీఎస్ స్పీడున్న ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తున్నామన్నారు. కానీ.... ఏడాదిగా ఇదిగో అదిగో అనడమే తప్ప ఇంతవరకు ఇవ్వలేకపోయిన విషయం మాత్రం చెప్పలేదు.
- కేవలం 149 రూపాయలకే టీవీ, వీడియో కాన్ఫరెన్సు ప్యాకేజీ, ఇంటర్నెట్ ఇస్తామని చెప్పారు. కానీ.... దానికోసం రూ.500 కూడా చేయని సెట్ టాప్ బ్యాక్సును 4 వేలకు అంటగడుతున్నామని మాత్రం చెప్పలేదు.