అఫిషియ‌ల్ః బాబు మ‌కాం ఏపీకి మారిపోయిన‌ట్లే

Update: 2016-11-13 04:15 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక ఏపీ రాజ‌కీయాల‌కే ప‌రిమిత‌మా? ఏపీలో పూర్తి స్థాయి పరిపాల‌నపై దృష్టిసారించి అక్క‌డికి అధికార యంత్రాంగాన్ని మార్చిన బాబు త‌న మ‌కాంను కూడా మార్చేయ‌డం వెనుక మ‌త‌ల‌బు ఏంటి? ఈ ప్ర‌శ్న‌లు ఇటు తెలుగుదేశం తెలంగాణ నేత‌ల్లో అటు రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. టీడీపీ అధినేత‌ చ‌ంద్ర‌బాబుతో స‌హా ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ ఓటుహక్కు హైదరాబాద్ నుంచి గుంటూరుకు మారడ‌మే ఇందుకు కార‌ణం.

ఇంతవరకు హైదరాబాద్‌ లో ఓటరుగా ఉన్న ఆయన తన ఓటుహక్కును గుంటూరు జిల్లాలోని ఉండవల్లికి మార్చాలని గతంలో ఎన్నికల కమిషన్‌ కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయన అభ్యర్థనను ఎన్నికల కమిషన్ ఆమోదించినట్టు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబుతో పాటు ఆయ‌న‌ సతీమణి భువనేశ్వరి - ఆయ‌న త‌న‌యుడు- పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి  లోకేశ్‌ కూడా వారి ఓటుహక్కును ఉండవల్లికి మార్చుకుంటున్నారని తెలిపాయి. ఇదిలాఉండ‌గా  ప్రస్తుతం జూబ్లీహిల్స్‌ లో ఉంటున్న చంద్రబాబు కుటుంబంలోని ఇతర సభ్యులు త్వరలో ఉండవల్లికి మారే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇప్ప‌టికే ప‌రిపాల‌న‌ - పార్టీ జాతీయ కార్యాల‌యం ఏపీకి మార్చిన సంగ‌తి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News